వివేక్ అనుకున్నది సాధిస్తారా

Spread the love
Will Vivek get what he wants

వివేక్ అనుకున్నది సాధిస్తారా ? పెద్దపల్లిలో టీఆర్ఎస్ ను ఓడిస్తారా ?

టీఆర్ఎస్ మాజీ నాయకుడు గడ్డం వివేక్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా టికెట్ ఇవ్వకపోవటంతో పార్టీకి రాజీనామా చేశారు . ఇక కొత్తగాఆయన పగ తీర్చుకునే పనిలోపడ్డారు . టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని ఆశించి భంగపడిన వివేక్ టీఆర్ఎస్ పార్టీకి ఓటెయ్యొద్దు అని పిలుపునిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన వివేక్ వెంటనే టీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని భావించారు. కానీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే గుర్తు జనాల్లోకి వెళ్ళే అవకాశం పెద్దగా వుండదేమో అని భావించి మళ్ళీ వెనక్కు తగ్గారు.
ఇక తనకు టికెట్ ఇస్తానని మోసం చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిప్పులు చెరిగిన వివేక్ తనకు జరిగిన అవమానానానికి ప్రతీకారం తీర్చుకునే పనిలో పడ్డారు. కేసీఆర్ తనని నమ్మించి మోసం చేశారని గత కొన్ని రోజులుగా మండిపడుతున్న వివేక్ ఈ ఎంపీ ఎన్నికలనే అందుకు ఆయుధంగా మలుచుకుంటున్నారు.పెద్దపల్లి నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీని దారుణంగా ఓడించాలని, ఆ పార్టీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటు వేయవద్దని వివేక్ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టడం ఆసక్తికరంగా మారింది. ఇదే అంశాన్ని తన వాట్సాప్ ద్వారా తన అనుచరగణానికి షేర్ చేసి సోషల్ మీడియా అంతటా దీన్ని సర్క్యులేట్ చెయ్యమని ఆదేశిస్తున్నారని సమాచారం .

ఇటీవలే హైదరాబాద్ లోని తన నివాసంలో తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమైన వివేక్ పెద్దపల్లిలోని 7 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శ్రేణులకు ఆదేశించారు. టీఆర్ఎస్ గెలవటానికి వీలు లేదని ఆయన గట్టిగా చెప్పారని స్థానికంగా టాక్ వినిపిస్తుంది. తద్వారా గులాబీ పార్టీకి పెద్దపల్లిలో చెక్ పెట్టాలనే ఆలోచనలో వివేక్ వున్నట్లు తెలుస్తోంది. మరి పెద్దపల్లిలో వివేక్ పంతం నెరవేరుతుందా? పెద్దపల్లి ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *