కోహ్లీ వ్యాఖ్యలకు విలియమ్సన్ కౌంటర్

Williamson Counter on Kohli Comments

భారత్-న్యూజిలాండ్ మధ్య మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో విరాట్ కోహ్లీ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా 2008లో తన సారథ్యంలో జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ ను గుర్తుచేసుకున్నాడు. అప్పుడు కూడా సేమ్ ఇలాగే విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ తో సెమీఫైనల్లో తలపడాల్సి వచ్చిందని గుర్తుచేశాడు. మళ్లీ ఇప్పుడు కూడా అలాగే జరుగుతోందని… ఫలితం కూడా అలాగే వుండాలని కోరుకుంటున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు. పదకొండేళ్ల తర్వాత యాదృచ్చికంగానే అయినా విలియమ్సన్ కెప్టెన్సీలోని కివీస్ జట్టుతో తన సారథ్యంలోని టీమిండియా సెమీస్ ఆడటం ఓ వైపు విచిత్రంగా, మరోవైపు ఉత్కంఠగా వుందన్నాడు. ఈ విషయాన్ని తప్పకుండా విలియమ్సన్ గుర్తుచేస్తానని కోహ్లీ అన్నాడు. ఇరు జట్లలో అప్పుడు అండర్ 19 ప్రపంచ కప్ ఆడిగాళ్లు చాలా మంది వున్నారని…వారందరికి రేపు జరగబోయే మ్యాచ్ చాలా ప్రత్యేకమన్నాడు. ఇలాంటి అరుదైన సందర్భం ఒకటి వస్తుందని తాను ఊహించలేదని..బహుశా విలియమమ్సన్ కూడా ఊహించి వుండడని తెలిపాడు.

ప్రస్తుతం భారత జట్టు చాలా అద్భుతంగా ఆడుతోందని…మరీముఖ్యంగా బౌలింగ్ విభాగం చాలా మెరుగుపడిందన్నాడు. బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్ రోహిత్ శర్మ గురించే చెప్పాల్సి వస్తుందని చమత్కరించాడు. అతడు పరిమిత ఓవర్ల క్రికెట్లో టాప్ ప్లేయర్ అని ప్రశంసించాడు. అతడిలా వరుస సెంచరీలను సాధించలేకపోవడం వల్ల నాకేమీ బాధ లేదని… హాఫ్ సెంచరీలతో టీమిండియా గెలుపులో తనవంతు పాత్ర పోషించినందుకు గర్వంగా ఫీలవుతున్నానని కోహ్లీ పేర్కొన్నాడు. ఇరు జట్ల మధ్య ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలకు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ధీటుగా జవాబిచ్చాడు. కానే విలియమ్సన్, రాస్ టైలర్ వికెట్లు తమకు కీలకమని కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించాడు.

తాను కేంద్ర బిందువుగా ఉండదలుచుకోలేదని కానే విలియమ్సన్ అన్నాడు. గత కొన్నేళ్లుగా చాలా మంది తమ ఆటగాళ్లు తగిన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారని, మ్యాచ్ లో విజయం సాధించడానికి తాము చాలా ముందుకు సాగి వచ్చామని చెప్పాడు. అదే అదృష్టం తమను ఈ మ్యాచులో వరిస్తుందని ఆయన అన్నాడు.టఇండియాపై తాము అండర్ డాగ్స్ గా అడుగు పెడుతునందుకు ఏ విధమైన అభ్యంతరం లేదని అన్నాడు. తాము మ్యాచులో ఏ విధంగా అడుతాం, తమ ప్లాన్స్ ఏ విధంగా అమలు చేస్తాం అనేవే ఇక్కడ ముఖ్యమవుతాయని అన్నాడు. చాలా సందర్భాల్లో ప్రతి జట్టు మరో జట్టును ఓడించినవే ఇక్కడ ఉన్నాయని ఆయన అన్నాడు. ఇది సెమీ ఫైనల్ కాబట్టి కొన్ని అదనపు బయటి పరిస్థితుల్లో కొంత తేడా ఉండవచ్చునని అన్నాడు. పరిస్థితులను అంచనా వేయడంపై అంతా ఆధారపడి ఉంటుందని, అద్భుతమైన ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మను తాము లక్ష్యంగా చేసుకుంటామని విలియమ్సన్ చెప్పాడు. ఓ టోర్నీలో రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడని, బౌలింగ్ యూనిట్ ఏం చేయాలనేది తాము ఆలోచిస్తామని అన్నాడు.

india vs new zealand match live

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *