సిద్ధూపై చెప్పు విసిరిన మహిళ

woman who threw her claim to speak against Modi

దేశంలో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. జాతీయ నేతల విమర్శలు, ప్రతి విమర్శలు తారా స్థాయికి చేరాయి. పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఓ మహిళ చెప్పు విసరడం కలకలం రేపింది. హర్యానాలో ఓ పబ్లిక్ మీటింగ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే సిద్ధూపై చెప్పు విసిరానంటూ పోలీసులతో ఆమె అంటున్న మాటలు ఓ చిన్న వీడియోలో రికార్డ్ అయ్యాయి. మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించేవారిలో సిద్ధూ కూడా ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే. ఏ చిన్న అవకాశం దొరికిగా మోదీపై విరుచుకుపడుతుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *