చేతబడి చేశాడని మహిళతో పాటు చితిపై యువకుడి దహనం

WOMEN AND YOUNG KILLED DOUBTING BLACK MAGIC
శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరుగులు పెడుతున్న నేటి రోజుల్లోనూ  ఇంకా మూడనమ్మకాలకు  ప్రజలు బలవుతున్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం  లేదు.  నేటికీ చేతబడి పేరుతో, బాణామతి పేరుతో  చాలా గ్రామాలలో ప్రజలు మూఢనమ్మకాలతో దారుణాలకు పాల్పడుతున్నారు.
దేశం ఇంకా మూఢనమ్మకాల్లో కొట్టుమిట్టాడుతోంది. మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం, సామాజిక వేత్తలు చేస్తున్న ప్రయత్నాలు బుడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయి . ఫలితంగా మూఢనమ్మకాలు, చేతబడుల ఆరోపణల్లో యువతి,యువకులు సైతం బలౌతున్నారు. గ్రామాలు,పట్టణాలు అనే తేడా లేకుండా మూఢనమ్మకాలు మానవ జీవితాలను చిద్రం చేస్తున్నాయి. .ఈనేపథ్యంలోనే తెలంగాణా రాష్ట్రంలో మూఢ నమ్మకాలకు మరో యవకుడు గ్రామస్తుల చేతిలో బలయ్యాడు. చేతబడి కారణంగా యువతి చనిపోయిందని భావించిన గ్రామస్తులు, దానికి కారణం అదే గ్రామానికి చెందిన మరో యువకుడు నమ్మిన ప్రజలు దారణంగా కొట్టి చంపారు.అనంతరం యువతి కాష్టం మీదే కాల్చి వేసిన దారుణ సంఘటన హైదరాబాద్ సమీపంలోని శామీర్‌పేట ప్రాంతంలో జరిగింది.సాధరణంగా ఒకే చితిమిద ఇద్దరి శవాలను కాల్చే సంస్కృతి హిందూ సమాజంలో ఉండదు. మూఢనమ్మకాల మాయాలో పడి యువకుడిని సైతం యువతి చితిపైనే కాల్చారు.దీంతో ఆ సంఘటన సంచలనంగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శామీర్‌పేట మండలం అద్రాస్‌పల్లికి చెందిన గ్యార లక్ష్మి అనే మహిళ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతోంది.అయితే ఆమె అనారోగ్యానికి కారణం చేతబడి అని కుటుంబ సభ్యులు నమ్మారు. యువతిపై చేతబడి ప్రయోగాలను చేసింది అదే గ్రామానికి చెందిన బోయిన అంజనేయులు అనే యువకుడని భావించి  గ్రామస్తులు అతన్ని సైతం చంపాలని భావించారు.  బుధవారం మరణించిన యువతికి దహన సంస్కారాలు నిర్వహించారు.లక్ష్మి మృతితో కుటుంబ సభ్యులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఎలాగైన లక్ష్మి చావుకు కారణమైన యువకున్ని చంపాలని నిర్ణయించారు.ఇందులో భాగంగానే చేతబడి ఆరోపణలు ఎదుర్కోంటున్న యువకుడు చావు దగ్గరకి వస్తాడని అంచనా వేశారు. దీంతో అక్కడే చంపివేయాలని భావించారు. అనుకున్నట్టుగానే యువకుడు కాష్టం వద్దకు వచ్చాడు దీంతో ఆయనపై మూకుమ్మడిగా దాడి చేసి,విచక్షణ రహితంగా కొట్టడంతో యువకుడు అక్కడికక్కడే చని పోయాడు. అనంతరం యువతిని కాల్చిన చితిపైనే యువకుడిని సైతం కట్టేల్లో వేసి కాల్చివేశారు. అయితే ఇంత జరుగుతున్నా గ్రామస్తులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు . ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసుని నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
BLACK MAGIC
tags : shamirpet, young man, killed, black magic, women death , police

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *