Women Faces Severe Problem With Porn Sites
హైదరాబాద్ లోని ఉప్పల్ కు చెందిన ఒక మహిళా ఐటీ ఉద్యోగినికి దారుణమైన పరిస్థితి ఎదురైంది. ఆమెకు వచ్చిన కష్టం వింటే పగవాడికి కూడా ఇలాంటి సమస్య రావద్దు అనిపిస్తుంది. ఇంతకీ ఆమెకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఉప్పల్ కి చెందిన 33 ఏళ్ల మహిళ ఐటీ కంపెనీలో పని చేస్తుంది. అయితే ఆమెకు ఆఫీస్ లో ఒక కొలీగ్ ద్వారా తెలిసిన విషయం ఆమెను షాక్ కు గురి చేసింది. ఆమె పేరును గూగుల్లో సెక్స్ చేసిన వెంటనే పోర్న్ సైట్స్ లింకులు ఓపెన్ అవుతున్నాయని సహ ఉద్యోగి చెప్పడం ఆమెను ఆవేదనకు గురి చేసింది. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఈ విషయం ఆఫీసులో అందరికీ తెలియడంతో సహోద్యోగుల నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అనేకమార్లు హేళనకు గురి అయింది. దీంతో ఆమె తన దారుణ పరిస్థితి పై గూగుల్ కు నోటీసులు పంపింది. అయినా గూగుల్ తామేమీ చేయలేమని చేతులెత్తేసింది. పోర్న్ సైట్ నుంచి పేర్లు తొలగించటం తమ చేతుల్లో లేదని గూగుల్ స్పష్టం చేయడంతో దిక్కుతోచని స్థితికి చేరుకునే ఆ మహిళ. రెండేళ్లుగా దారుణమైన పరిస్థితి అనుభవిస్తున్నానని ఆవేదన చెందుతుంది.
తన పేరును సెర్చ్ చేసినంతనే పోర్న్ సైట్లు ఓపెన్ కావటంపైన సదరు సైట్ల నిర్వాహకులకు.. వెబ్ హోస్ట్ ప్రొవైడర్లకు నోటీసులు పంపారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. దీంతో ఆ మహిళ ఉద్యోగి తీవ్ర మనస్థాపానికి గురి అవుతుంది. టెక్నాలజీ పెరిగిన నేటి రోజుల్లో, అదే టెక్నాలజీ ఒక మహిళ ఆవేదనకు కారణం అవుతున్న సైబర్ క్రైమ్ పోలీసులు సమస్య పరిష్కరించ లేకపోవడం సదరు కుటుంబానికి ఆవేదనను కలిగిస్తుంది. ఇప్పటికైనా చర్యలు తీసుకొని తనకు విముక్తి కలిగించాలని ఆ మహిళా వేడుకుంటుంది.
tags : Hyderabad IT Lady, porn websites, google search , cyber crime