జనసేనకు గుడ్ బై చెప్పిన మహిళా నాయకురాలు

WOMEN LEADERS LEFT JANASENA PARTY

ఏపీలో జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ దారుణమైన ఓటమిని మూట గట్టుకున్న జనసేన అవరోధాలను అధిగమించి పార్టీని ముందుకు నడిపించడానికి, జనసేన కార్యకర్తల్లో, నేతల్లో ధైర్యం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. కానీ పవన్ కు జనసేన నుండి వలస వెళ్తున్న నేతలు వరుస షాకులిస్తున్నారు.. జనసేన పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్న నేతలు జనసేన పార్టీ పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
ఎన్నికలకు ముందే జనసేన పార్టీలో చేరిన కొందరు నేతలు కూడా జనసేన పార్టీ ని వదిలి వేరే పార్టీలో చేరిపోయారు. రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణ వంటి నేతలు జనసేన కు గుడ్ బై చెప్పి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఇక తాజాగా జనసేన పార్టీ కి మరొక పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. జనసేన పార్టీలో నిన్నటి వరకు పనిచేసిన మహిళా నాయకురాలు జనసేనకు షాక్ ఇచ్చారు. జనసేన పార్టీ మహిళా నాయకురాలు పుట్టి లక్ష్మీసామ్రాజ్యం జనసేన కు షాక్ ఇచ్చి బిజెపిలో చేరి పోయారు.బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలతో కలిసి లక్ష్మి సామ్రాజ్యం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు పార్టీ వీడిన లక్ష్మీ సామ్రాజ్యం జనసేన పార్టీ పైన తీవ్రమైన ఆరోపణలు చేసి అందరినీ షాక్ కి గురి చేశారు.
జనసేన మహిళా నాయకురాలు లక్ష్మి సామ్రాజ్యం ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సామ్రాజ్యం గుంటూరు జిల్లా పెదకూరపాడు జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేనను వీడి బిజెపిలో చేరిన ఆమె జనసేన పార్టీ కి సంబందించి జరుగుతున్న పరిణామాలు నచ్చకనే పార్టీ మారుతున్నానని చెప్పారు. ఎన్నికల సమయంలో సొంత పార్టీ నేతలే తనపై లేనిపోని దుష్ప్రచారాలు చేసి, మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టారని ఆమె ఆరోపించారు. అసలు నిజాయితీగా పని చేసేవారికి జనసేన పార్టీలో స్థానం లేదని, పవన్ కళ్యాణ్ దగ్గర పెద్దగా గుర్తింపు ఉండదని ఆమె పేర్కొన్నారు. తొందర్లోనే జనసేన పార్టీకి చెందిన మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరతారని తెలిపారు. జనసేన పార్టీ అవుతుందని ఆమె జోస్యం చెప్పారు.

KCR YADADRI  TOUR

 

Related posts:

ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఉన్నావ్ రేప్ కేస్...
టిక్ టాక్ లో వీడియో చేసి....
నిందితులకు 14 రోజుల రిమాండ్
ప్రియాంక రెడ్డి హత్య..షాద్‌నగర్ లో ఉద్రిక్తత
బ్రేకింగ్ న్యూస్.. అచ్చెన్నాయుడుకు కారు ప్రమాదం
ప్రియాంకా రెడ్డి హత్య కేసు నిందితులను కోర్టుకు...
తిరుమల కొండపై ప్రైవేట్ హోమం
ప్రియాంకా రెడ్డి హత్యపై జాతీయ మహిళా కమీషన్ సీరియస్
ప్రియాంక కేసులో నిందితులు వీరే...మంత్రి తలసాని పరామర్శ
ఫోటోల కోసం ఫోజులివ్వడానికి వచ్చావా
ఆర్టీసీ కార్మికులను చేర్చుకుంటాం: కేసీఆర్
ప్రియాంక స్కూటీ పంచర్ చేశారా? వారి పనేనా?
ప్రియాంక రెడ్డి హత్య కేసులో 15 బృందాలతో గాలింపు
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి సజీవ దహనం
జార్జ్‌ చనిపోవడానికి ముందు ఎం జరిగిందంటే...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *