విమెన్ ఆఫ్ ద ఇయ‌ర్ సీతారామ‌న్ 

Women Of The Year Sitaraman

ఈ ఏటి మేటి మ‌హిళ‌ల జాబితాను ప్ర‌ముఖ ప్ర‌చుర‌ణ సంస్థ ఫోర్బ్స్ వెల్ల‌డించింది. ఆ క్ర‌మంలో ఈ ఏటి మేటి మ‌హిళ‌గా నిలిచారు మ‌న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్.. ఆమెతో పాటు మ‌రో ఇద్ద‌రు ఈ ఏటి విజేత‌లుగా భార‌తీయ స‌మూహం నుంచి ఎంపిక‌య్యారు..మొత్తం వంద మందితో కూడిన శ‌క్తిమంత‌మ‌యిన మ‌హిళ‌ల జాబితాలో నిర్మ‌లా సీతారామ‌న్ 34వ ర్యాంకు గెలుచుకున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌న తెలుగింటి కోడ‌లు మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాల‌ని ఆశిద్దాం.

సామాన్య కుటుంబం నుంచి వ‌చ్చి త‌మిళ నాట పెరిగి తెలుగింటి కోడ‌లుగా వచ్చిన నిర్మలా సీతారామ‌న్ ఒక‌నాటి ఏపీ స‌ర్కార్ స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ జీవ‌న స‌హ‌చ‌రి. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన ధీర. ఆధునిక భావాలున్న మ‌గువ. స్వ‌తంత్ర భార‌తావ‌నిలో ఇందిరా గాంధీ త‌రువాత అంత‌టి అత్యున్న‌త రీతిలో  ప‌ద‌వి అందుకున్న అమాత్యురాలు..మోడీ స‌ర్కారు -1లో ర‌క్ష‌ణ శాఖ మంత్రి.. త‌రువాత ఆర్థిక శాఖ పగ్గాలు అందుకుని, త‌న‌ని తాను నిరూపించుకున్న విష‌య నిపుణురాలు.. ఇంకా ఎన్నో విశిష్ట‌త‌ల మేళ‌వింపు.. ఓ సంద‌ర్భంలో ఆమె ఇలా అంటారు ఇదంతా భ‌గ‌వ‌త్ కృపే అని! నేను మంత్రి అయినా మ‌రో కీల‌క ద‌శ‌కు చేరుకున్నా ఎన్న‌టికీ ఓ సాధార‌ణ గృహిణినే..ఆ త‌రువాతే ఏమ‌యినా.. అన్న‌ది ఆమె అభిప్రాయం..ఆమె కోవ‌లోనే మ‌రో ఇద్ద‌రు
(హెచ్సీఎల్ కార్పొరేష‌న్ సీఈఓ  రోష్నీ నాడార్, బ‌యోకాన్ ఫౌండర్ కిర‌ణ్ మంజుదార్ షా) కూడా శ‌క్తిమంతం అయిన మ‌హిళ‌లుగా ఈ ఏడాది తామేంటో నిరూపించుకుని భార‌తీయ మ‌గువ‌ల స‌త్తా చాటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *