టీడీపీకి షాక్ ఇవ్వనున్న సాధినేని యామిని

Yamini sadhineni to shock TDP

తెలుగుదేశం పార్టీకి సాధినేని యామిని షాక్ ఇవ్వనున్నారా ? టీడీపీ ఏపీ మహిళా నాయకురాలు సాదినేని యామిని బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారా ? అంటే అవును అంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు ఆమె వైసీపీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అప్పుడు గుంటూరు అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలని ఆమె కోరుకున్నారు. అయితే, పార్టీ అధిష్ఠానం ఆ సీటును మరో నేతకు కేటాయించడంతో ఆమె నిరాశకు లోనయ్యారు. తదనంతరం పార్టీ ఓటమి, రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలో బీజేపీ అధికారం ఏర్పాటు చేయటంతో యామిని బీజేపీలోకి మారాలని నిర్ణయించుకున్నారు.అయితే, అప్పట్లో చంద్రబాబు ఆమెను సముదాయించడంతో మిన్నకుండిపోయారు.  తాజాగా బీజేపీ ఇతర పార్టీల నేతలను ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, ఆమెను బీజేపీ నేతలు సంప్రదించారు. పార్టీ అధికార ప్రతినిధి పదవి ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో ఆమె కూడా రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో చర్చలు కూడా జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 10న అధికారికంగా కమలం పార్టీలో చేరునున్నారని తెలుస్తుంది.
tags : andhra pradesh, sadhineni yamini , tdp, chandrababu, ycp government, bjp

విజయారెడ్డి సజీవ దహనం చేసిన సురేష్ మృతి

విజయారెడ్డి సజీవదహనం ఘటన మరువకముందే మరో ఘటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *