అమరావతిని చూస్తే జగన్ కు బాబే గుర్తొస్తాడు…

Yanamala Rama Krishnudu press meet in Mangalagiri

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ కు ప్రజలు పట్టం కట్టినంత మాత్రాన  రాజధానిని మార్చే హక్కు ఆయనకు లేదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు విమర్శించారు. మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ, అమరావతిలో రాజధాని ఉండకూడదని జగన్ చూస్తున్నారని ఆరోపించారు.అమరావతిని చూస్తుంటే జగన్ కు చంద్రబాబే గుర్తుకొస్తున్నారని, దీనిని జగన్ భరించలేకపోతున్నారని మండిపడ్డారు .మయసభను చూసి దుర్యోధనుడికి అసూయ కలిగినట్టుగా, అమరావతిని చూస్తే జగన్ కు కూడా అదే మాదిరి పరిస్థితి ఉందని విమర్శించారు. .

నిన్న శాసనమండలిలో వైసీపీ సభ్యులు, మంత్రులు ఎలా ప్రవర్తించారో ఫొటోలు, దృశ్యాలు చూస్తే తెలుస్తుందని విమర్శించారు. రూల్ 154 ప్రకారం చైర్మన్ నిర్ణయం తీసుకుని సెలెక్ట్ కమిటీకి పంపారని, చైర్మన్ విచక్షణాధికారాన్ని ప్రశ్నించేందుకు వీళ్లెవరు? అని ప్రశ్నించారు. చైర్మన్ విచక్షణాధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని, సీఎం జగన్ కు రూల్స్ తెలియవని, ఆయనకు ఎవరూ చెప్పరని యనమల విమర్శించారు. నిన్న మండలిలో 22 మంది మంత్రులు, వైసీపీ సభ్యులు తిష్టవేశారని, సభలో కార్యకలాపాలు ప్రభావితం చేయాలనుకున్నారని యనమల  ఆరోపించారు. వీళ్లందరినీ బయటకు పంపాలని రూల్ ప్రకారం తాను కోరానని, మండలి, అసెంబ్లీ రెండు వేర్వేరు వ్యవస్థలని  వాటి అధికారాలు, బాధ్యతలు వేర్వేరుగా ఉంటాయని, రూల్ బుక్ చేస్తే అర్థమవుతుందని అన్నారు.

Yanamala Rama Krishnudu press meet in Mangalagiri,AP council , Capital decentralization bill

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *