టీడీపీ ప్రతిపక్ష హోదా గల్లంతు చేసే పనిలో వైసీపీ

YCP Tries To Close Entire TDP

తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదా గల్లంతు చేసే పనిలో వైసీపీ ఉంది. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.అయితే ఇప్పటికే ఏపీలో పలువురు టిడిపి ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకునే వ్యూహాత్మక ఎత్తుగడ తో వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఒకవేళ అదే కనుక సాధ్యమైతే అసెంబ్లీలో టీడీపీ కి ప్రతిపక్ష హోదా గల్లంతు కావడం ఖాయమని చర్చ ప్రధానంగా జరుగుతుంది. టీడీపీ కి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలకు వైసీపీ గురి పెట్టిందని తాజా పరిణామాలతో తెలుస్తుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసేలోగా టిడిపి ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేలా చేస్తే టీడీపీని దెబ్బ కొట్టినట్టుగా ఉంటుందని వైసిపి నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం ఇప్పుడున్న 22 మంది సభ్యుల్లో ఆరుగురు సభ్యులు పార్టీ మారితే టిడిపి ఎమ్మెల్యేల సంఖ్య 16కు పడిపోతుంది. మొత్తం 175 మంది సభ్యులున్న ఏపీ అసెంబ్లీలో ఒకవేళ అదే జరిగితే టీడీపీకి కేవలం 16 మంది సభ్యులు మాత్రమే ఉంటే అప్పుడు టిడిపి ప్రతిపక్ష హోదా కూడా గల్లంతు అవుతుంది.

కేవలం 16 మంది సభ్యులు అంటే 10 శాతం కంటే తక్కువ కావడంతో ప్రతిపక్ష హోదా గల్లంతు అవుతుందని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి. దీంతో చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా అని కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక సాధారణ ఫ్లోర్ లీడర్ స్థాయికి చంద్రబాబు హోదా పడిపోతుంది.

అయితే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయించిన నేతలు ఎవరైనా పదవులకు రాజీనామా చేసి రావాలని చెప్పటమే, ఏపీలో ఎమ్మెల్యేలకు ఇప్పుడు కంటకంగా మారింది. అయినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో, టిడిపిలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్న కొందరు, వైసిపి బాట పట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *