వైసీపీ మహిళా ఎమ్మెల్యే వినాయకుడికి పూజ చేస్తే మైల పడతాడట

YCP Women Leader Creates Sensation Making Ganesh Pooja

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి పండుగ రోజున, వినాయకుడి సాక్షిగా ఓ దళిత ఎమ్మెల్యేకు అవమానం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించారు కొందరు టిడిపి నేతలు. వినాయకచవితి వేడుకల సాక్షిగా జరిగిన ఈ ఘటనలో ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి పెట్టారు.
గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్థానిక టీడీపీ నేతలు చేసిన అవమానకర వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన నియోజకవర్గంలోని తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో వినాయక మండపం వద్ద పూజలో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి కి చేదు అనుభవం ఎదురైంది. అయితే ఆమె వ్యతిరేకులు కొందరు పూజలు చేయడాన్ని వ్యతిరేకించారు. శ్రీదేవి గణేష్‌ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే వినాయకుడు మైలపడతాడు అంటూ ఆమెను కులం పేరుతో దూషించి హేళన చేశారు. దీంతో మనస్తాపానికి లోనైన ఎమ్మెల్యే కంటతడి పెట్టారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఈ సంఘటన తర్వాత శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. తనను అవమానించిన టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించి ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ నే తలు ఇంకా మారలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నేతలు తామే అధికారంలో ఉన్నట్టు ఫీలవుతున్నారని తెలిపారు ఎమ్మెల్యే శ్రీదేవి. ఓ దళిత మహిళా ఎమ్మెల్యేను అని కూడా చూడకుండా తనను కులం పేరుతో దూషించడం తగదని ఆమె పేర్కొన్నారు. ఇక దళిత మహిళ ఎమ్మెల్యేను వినాయక పూజ నిర్వహించవద్దని అడ్డుకున్న టిడిపి నేతలపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అణగారిన వర్గాల వారు అంటే టీడీపీకి ఎప్పుడూ చిన్నచూపే నన్న ఎమ్మెల్యే శ్రీదేవి ఓ మహిళా ఎమ్మెల్యే విషయంలోనే ఇలా ఉంటే సాధారణ ప్రజల విషయంలో ఇంకెలా వ్యవహరిస్తారో ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపైన్యాయం పోరాటం చేస్తానని కూడా శ్రీదేవి తెలిపారు.ఇక దీనిపై ఎమ్మెల్యే శ్రీదేవి చేసిన ఫిర్యాదు మేరకు నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

Janapriya Urban Farms

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *