మీ నిధులు… మీ ఇష్టం

14
YOUR FUNDS.. AS YOU LIKE
YOUR FUNDS.. AS YOU LIKE

YOUR FUNDS.. AS YOU LIKE

జీవో జారీ చేసిన తెలంగాణ‌ ప్ర‌భుత్వం

గ్రామ స‌భ‌ ఆమోదంతో పంచాయ‌తీల నిధులు వారికి న‌చ్చిన ప‌నుల‌కు ఖ‌ర్చు చేసుకోవ‌చ్చు

ఆర్థిక సంవ‌త్స‌రం నిధులు, నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే ప‌నులు చేప‌ట్టాలి

మ‌రింత‌గా ప‌రుగులు పెట్ట‌నున్న ప‌ల్లెల ప్ర‌గ‌తి

స‌ద్వినియోగం చేసుకోవాల‌ని గ్రామ పంచాయ‌తీల‌కు ఎర్ర‌బెల్లి పిలుపు

సీఎం కేసీఆర్‌ కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి

గ్రామ పంచాయతీల నిధులను, పై అధికారుల అనుమ‌తులు లేకుండానే, ఆయా గ్రామ ప్రజలు, పంచాయితీల తీర్మానం మేరకే ఖర్చు చేసుకునే వీలు కల్పిస్తూ నిన్న రాత్రి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ప్ర‌భుత్వం సంబంధిత జీవో 91 ని జారీ చేసింది. తద్వారా ఇక నుంచి స్థానిక అవసరాల మేరకు నిధులను ఖర్చుచేసుకునే వెసులుబాటు పంచాయతీలకు లభిస్తుంది. అయితే, గ్రామ స‌భ ఆమోదం మేర‌కు గ్రామ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఆయా ప‌నులు చేప‌ట్టాల్సి ఉంటుంది. ఆయా ప‌నుల‌న్నీ నిబంధ‌న‌ల మేర‌కు మాత్ర‌మేగాక‌, ఆ ఆర్థిక సంవ‌త్స‌ర కేటాయింపుల‌కు మించ‌కుండా మాత్ర‌మే ఖ‌ర్చు చేయాల‌ని ప్ర‌భుత్వం ఆ జీవోలో పేర్కొంది. ఈ జీవో రావ‌డం వ‌ల్ల ఇప్ప‌టికే ప‌ల్లె ప్ర‌గ‌తితో అభివృద్ధి, పారిశుద్ధ్యం, ప‌చ్చ‌ద‌నం ప‌రుచుకున్న ప‌ల్లెలు ఇక ప్ర‌గ‌తిలోనూ మ‌రింత‌గా ప‌రుగులు పెడ‌తాయ‌ని రాష్ట్ర పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. వెంట‌నే జీవో జారీ చేసిన ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుకి మంత్రి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెలిపారు.

* గ‌తంలో ల‌క్ష లోపు ప‌నుల‌కు డీపీఓలు, ఆపై పనుల‌కు ఆ పై ఉన్న‌తాధికారుల అనుమ‌తులు అవ‌స‌రం ఉండేవ‌న్నారు. ఈ జీవోతో ఆ అనుమ‌తులు అవ‌స‌రం లేకుండానే, సంక్ర‌మించే అధికారాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయ‌తీల స‌ర్పంచ్ లు, ఉప స‌ర్పంచ్ లు, వార్డు స‌భ్యులు, ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన సీఎం, తాజాగా ఇచ్చిన జీవోతో దేశంలో ఎక్క‌డాలేని విధంగా నిర్ణ‌యం తీసుకున్నార‌ని, దీంతో గ్రామాలు మ‌రింత వేంగంగా అభివృద్ధి చెంద‌డానికి వీలు క‌లుగుతుంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు. ఎక్క‌డ ఎలాంటి వివాదాల‌కు తావు లేకుండా, నిధుల దుర్వినియోగం జ‌ర‌గ‌కుండా, ప‌నులు నాణ్యంగా జ‌రిగే విధంగా గ్రామ‌ పంచాయ‌తీల బాధ్యులు న‌డుచుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

 

TELANGANA PANCHAYATHS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here