బాబు చేసిన ఆవు వ్యాఖ్యలు తట్టుకోలేక 100 ఆవులు మృతి చెందాయన్న వైసీపీ నేత

Spread the love

YSR CP FUNNY COMMENTS ON CHANDRABABU

బాబు చేసిన ఆవు వ్యాఖ్యలు తట్టుకోలేక 100 ఆవులు మృతి చెందాయని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత రవి చంద్రా రెడ్డి . గత ఎన్నికల్లో టీడీపీ చావుదెబ్బ తిన్న చంద్రబాబు ఏమాత్రం మారలేదని వైసిపి నేత రవిచంద్ర రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ఎలా ఓడిపోయారు అన్నది చంద్రబాబుకు నేటికి అర్థం కాకపోవడం ఏమిటని ప్రశ్నించిన ఆయన చంద్రబాబు గొప్ప నటుడని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీలో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయంలో ఆత్మవంచన చేసుకుంటూ, పరనింద వేస్తున్నారని వైసీపీ నేత రవిచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు.
‘పాలిచ్చే ఆవును వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు’ అన్న బాబు వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు తనను తాను పాలిచ్చే ఆవుతో పోల్చుకున్నారని, అలా, ఆయన పోల్చుకోగానే దాదాపు వంద ఆవులు మృత్యువాత పడ్డాయని పేర్కొన్న రవిచంద్రారెడ్డి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆవుల సైతం తట్టుకోలేక పోయాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక అంతే కాదు చంద్రబాబు పాలనంతా కరువుకాటకాలు పాలని, ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం అలమటించిన రోజులు అని పేర్కొన్న ఆయన చంద్రబాబు పరిపాలించిన అన్ని రోజులు వానలు పడలేదని, కరవు కాటకాలతో ప్రజలు అల్లాడారని అన్నారు. కానీ జగన్ పరిపాలనలో జలాశయాలు నిండుకుండల్లా మారాయని పది సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ గేట్లు తెరిచారని, ప్రకాశం బ్యారేజ్ గేట్లు కూడా తెరిచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందని అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రకృతి కూడా కరుణించలేదని రవిచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.
ఇక చంద్రబాబు బాలయ్య బాబు ని మించిన గొప్ప నటుడని విమర్శల వర్షం కురిపించారు రవిచంద్రారెడ్డి. లెజెండ్ నేను .. బాలకృష్ణ బాబు.. మీరు కాదు. నేను ఎంత బాగా యాక్టు చేస్తానో చూడండి అని చెప్పే విధంగా అద్భుతమైన నటనా చాతుర్యాన్నిప్రజల ముందు చంద్రబాబు ప్రదర్శిస్తున్నారని వెటకారం చేశారు వైసిపి నేత రవిచంద్రారెడ్డి.

YUVAKALAVAHINI PRIDE OF INDIAN CINEMA AWARDS

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *