హవ్వా.. బాలయ్య ఇంట్లో టీడీపీ సోషల్ మీడియా ఆఫీస్

YSRCP COMPLAINED AGAINST TDP SOCIAL MEDIA

సీఎం జగన్‌పై, వైసీపీ ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ను వైసీపీ నేతలు కోరారు. మహిళా ప్రజా ప్రతినిధులమని కూడా చూడకుండా దారుణమైన పోస్టులు పెడుతున్నారని వైసీపీ నేతలు  మండిపడ్డారు. చంద్రబాబుకి కుటుంబ సభ్యులు లేరా? అని మండిపడ్డారు. చివరికి జగన్ తల్లి విజయమ్మను కూడా వదలడం లేదని, అభ్యంతరకర పోస్టులు పెడుతున్న టీడీపీ వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డీజీపీని కోరారు .. సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ నేతలు పోస్టులు పెట్టారని, వాటిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని సవాల్ విసిరారు. చంద్రబాబు పెట్టిన క్షోభ వల్లే ఎన్టీఆర్, కోడెల చనిపోయారని, ఎమ్మెల్య బాలకృష్ణ ఇంట్లో టీడీపీ సోషల్ మీడియా కార్యాలయం నడుస్తోందని జోగి రమేశ్ ఆరోపించారు.

టీడీపీ విమర్శించడమే పనా?
సీఎం జగన్ కుటుంబంపై టీడీపీ పోస్టింగ్స్ చూస్తుంటే అభ్యంతరకరంగా ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఎమ్మెల్యే అయిన తనపైనే దాడి చేయించారని, పెయిడ్ ఆర్టిస్ట్ లతో మంత్రులను తిట్టించారని టీడీపీ నేతలపై ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏపీని సంక్షోభంలోకి నెట్టారని, కేవలం నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది అని కొనియాడారు. జగన్ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా టీడీపీకి విమర్శించడమే పని అని, అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ కుటుంబంపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఖండించారు. చంద్రబాబు వికృత చేష్టలకు పాల్పడుతున్నారని, సమాజం తలదించుకునేలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పెట్టిన మానసిక క్షోభతోనే, ఎన్టీఆర్, కోడెల శివప్రసాదరావు చనిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైనా చంద్రబాబు తీరు మారలేదని విమర్శలు చేశారు.

tags: ycp mla undavalli sridevi, jogi ramesh , tdp, balakrishna, social media, trolls , complaint, dgp , goutham sawang

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *