వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటన మార్చి 16 న

YSRCP Contestant List announcing in march 16 .. ఎందుకంటే

ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఏపీలో పార్టీలు యుద్ధ ప్రాతిపదికన ప్రచార పర్వానికి తెర తీయబోతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నేడు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామని చెప్పడంతో అటు పార్టీ శ్రేణులలోనూ , ఇటు అధికార టీడీపీలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ముహూర్తం దాటి పోయిన కారణంగా నేడు విడుదల చేయాలనుకున్న తొలి జాబితాను మార్చి 16వ తేదీన ఇడుపులపాయలో విడుదల చేయనున్నట్లు వైసిపి ప్రకటించింది. అలాగే ఎన్నికల ప్రచారానికి ఇడుపులపాయలోని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళులర్పించి, ఆయన ఆశీస్సులతో ప్రచార పర్వాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఇడుపులపాయలో మార్చి 16వ తేదీన అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో పాటు గా, 10 గంటల 26 నిమిషాలకు ఇడుపులపాయ నుండి వైయస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. దీంతో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవాలని ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించాల్సిన తొలి జాబితా వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని మార్చి 16కి వాయిదా వేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. 16 ఉదయం 10.26 గంటలకు జాబితాను విడుదల చేయనుంది. వైసీపీ తొలి జాబితా ఈ రోజు ఉదయం 10.30గంటలకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు అని ప్రకటన రావటంతో పార్టీ లో ఉత్కంఠ నెలకొంది .కానీ ముహూర్తం దాటిపోవటంతో ప్రకటన వాయిదా వేశారు జగన్. 70 నుంచి 80 మందితో తొలి జాబితాను విడుదల చేయనున్నారు అని , అలాగే పార్టీలో చేరికలను బట్టి రెండు మూడు రోజుల్లో రెండో జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం. 20 నుంచి 40 మంది అభ్యర్థులతో వైసీపీ రెండో జాబితా విడుదల కానుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *