వైసీపీ నేత చంద్రమౌళి మృతి

YSRCP Leader ChandraMouli Dead

హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుప్పం వైసిపి ఇన్ ఛార్జ్ చంద్రమౌళి కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై పోటీచేశారు. 1990 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన చంద్రమౌళి, ఐఏఎస్ ని విడిచిపెట్టి 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. గడిచిన రెండు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుపై కుప్పం నుంచి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో 55 వేల ఓట్లు, 2019 ఎన్నికల్లో సుమారు 70 వేల ఓట్లు సాధించి అందరి దృష్టి ఆకర్షించారు. ఈ మేరకు ఆయన మృతిపై వైఎస్ జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబీకులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వెనకబడిన తరగతి వర్గానికి చెందిన ఆయన, అటు ప్రజలకు ఇటు పార్టీకి చేసిన సేవలు ఎల్లకాలం గుర్తుండిపోతాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జీ చంద్రమౌళి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఐఏఎస్ అధికారిగా ఆయన సుమారు ముప్పయ్ ఏండ్ల పాటు వివిధ హోదాల్లో పని చేశారని, కడప జిల్లా కలెక్టర్ గా కూడా సేవలను అందించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ysrcp updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *