9 మందితో వైఎస్సార్ సీపీ తొలి జాబితా

Spread the love

YSRCP MP FIRST LIST

  • లోక్ సభ అభ్యర్థుల ప్రకటన
  • నేడు రెండో విడత జాబితా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్ సభకు పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. శనివారం రాత్రి హైదరాబాద్ లో ఆ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 9 మందితో తొలి విడత జాబితాను విడుదల చేశారు. రెండో జాబితాను పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఇడుపులపాయలో ప్రకటిస్తారు. దీంతోపాటు 150 మందితో అసెంబ్లీ జాబితా కూడా అక్కడే ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం ప్రకటించిన తొమ్మిది మంది అభ్యర్థుల్లో.. బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు. తొలి జాబితాలో ఇద్దరు ఓసీ సామాజికవర్గానికి చెందినవారు ఉండగా.. ఒక ఎస్టీ, ముగ్గురు బీసీ, ముగ్గురు ఎస్సీ వర్గానికి చెందినవారు ఉన్నారు. తొలి జాబితాలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

తొలి జాబితా అభ్యర్థులు వీరే…

అరకు – గొడ్డేటి మాధవి
అమలాపురం- చింతా అనురాధ
రాజంపేట- పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి
కడప- వైఎస్‌ అవినాష్‌ రెడ్డి
హిందూపురం – గోరంట్ల మాధవ్
అనంతపురం – తలారి రంగయ్య
బాపట్ల – నందిగం సురేష్‌
చిత్తూరు- నల్లకొండగారి రెడ్డప్ప
కర్నూలు – డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *