‘టీ’ న్యూస్ సూరజ్ కు యువ కళావాహిని అవార్డు

Spread the love

YUVAKALAVAHINI PRIDE OF INDIAN CINEMA AWARDS

యువ కళా వాహిని ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డు, ఫిల్మ్ & టెలివిజన్, మీడియా అవార్డుల ప్రదానోత్సవం

యువ కళా వాహిని ఆధ్వర్యంలో ఇవ్వాళ సినీ, టీవీ, జర్నలిజం రంగాల్లో ప్రముఖులకు అవార్డు బహుకారణ జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ప్రసాద్ లాబ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డును సినీ నటి షావుకారు జానకి అందుకున్నారు. యువ కళా వాహిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రముఖ ఛాయా గ్రాహకుడు ఎస్. గోపాల్ రెడ్డి, ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు జీ. ఆనంద్ అందుకున్నారు. ఇక యువ కళా వాహిని ఫిల్మ్ ఎక్సెలెన్సీ అవార్డును సినీ రచయిత లక్ష్మీ భూపాల్, సినీ గేయ కర్త శ్రీరామ్, సినీ నటి అనన్య, సినీ నటుడు ఆనంద్ చక్రపాణి, సినీ దర్శకుడు జాకీ, సినీ నిర్మాత లోహిత్ లు అందుకున్నారు. వీళ్లతో పాటు మరో 12 మందికి టెలివిజన్ ఎక్సెలెన్సీ అవార్డులు దక్కాయి.

ఇక జర్నలిజంలో సేవలందిస్తున్న 12 మంది కూడా యువ కళా వాహిని మీడియా ఎక్సెలెన్సీ అవార్డులు అందుకున్నారు. వీళ్లలో టీ న్యూస్ సీనియర్ స్పెషల్ కరస్పాండెంట్ సూరజ్ వి. భరద్వాజ్, టీవీ 9 న్యూస్ కో ఆర్డినేటర్ చిల్కూరి హరిప్రసాద్, 10 టీవీ అసిస్టెంట్ ఎడిటర్ సతీష్, సాక్షి పత్రిక డెప్యూటీ చీఫ్ రిపోర్టర్. సత్యబాబు, బీబీసీ కరస్పాండెంట్ రూప వాణి కోనేరు, ఏబీఎన్ ఫీచర్స్ ఇంఛార్జి నేహా రెడ్డి, ఎన్టీవీ న్యూస్ రీడర్ క్రాంతి గుత్తికొండ తదితరులు ఉన్నారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, సినీ నటీమణులు జమున, గీతాంజలి, దర్శకులు ముత్యాల సుబ్బయ్యలు పాల్గొన్నారు. యువ కళా వాహిని తరఫున తమకు అవార్డులతో సన్మానించిందుకు నిర్వాహకులు సారిపల్లి కొండలరావు, మహమ్మద్ రఫీ, నాగేశ్వర్ రావులకు అవార్డు గ్రహీతలు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *