రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయం

Spread the love

YUVI GOOD BYE TO CRICKET

  • అంతర్జాతీయ క్రికెట్ కు యువరాజ్ సింగ్ వీడ్కోలు
  • కేన్సర్ బాధితులకు అండగా ఉంటానని వెల్లడి

అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా సభ్యుడు యువరాజ్ సింగ్ వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. తనకు ఎంతో ప్రాణప్రదమైన క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్టు సోమవారం ముంబైలో ప్రకటించాడు. 19 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు చూశానని.. జీవితంలో ఎలా పోరాడాలో ఆట తోనే నేర్చుకున్నానని వ్యాఖ్యానించాడు. ఇకపై కేన్సర్ బాధితులకు అండగా ఉంటానని చెప్పాడు. 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఐసీసీ నాకౌట్ టోర్నీలో అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేసిన యువీ.. 2012లో ఇండ్లండ్ పై చవరి టెస్ట్, 2017లో చివరి వన్డే, టీ20 మ్యాచ్ ఆడాడు. భారత్ గెలుచుకున్న రెండు ప్రపంచకప్ టోర్నీల్లోనూ యువరాజ్ దే కీలకపాత్ర. ఆ రెండు టోర్నీల్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అతడిదే.

మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌ ల్లో 3 సెంచరీలు, 11 అర్థ సెంచరీలతో 1900 పరుగులు చేశాడు. 304 వన్డేల్లో 14 సెంచరీలు, 52 అర్థ సెంచరీలతో 8,701 పరుగులు చేశాడు. 58 టీ20 మ్యాచ్‌ ల్లో 8 ఆఫ్‌ సెంచరీలతో 1177 పరుగులు చేశాడు.  సిక్సర్ల సింగ్ గా పేరు సంపాదించుకున్న యువీ.. మంచి బౌలర్ కూడా. 2007 టీ20 ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టి రికార్డు సాధించాడు. కేన్సర్ ఉన్నప్పటికీ, 2011 ప్రపంచకప్ ఆడి, భారత్ కప్ గెలుచుకున్న తర్వాత అమెరికా వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చాడు. తర్వాత జట్టులో చోటు సంపాదించినా, నిలకడలేమి ఆటతీరుతో 2017లో జట్టుకు దూరయ్యాడు. 2019లో జరిగిన ఐపీఎల్-12లో సరిగా ఆడలేకపోయాడు. దీంతో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *