అక్కడ రాహుల్ కు కేసీఆర్ సహకరించాలని

KCR Supports Rahul Gandhi

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటికి మొన్న భట్టి విక్రమార్కకు సీఎల్పీ పదవి ఇవ్వడం వెనుక సామాజిక సమీకరణాలే కాకుండా, లాబీయింగ్ కూడా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు జగ్గారెడ్డి. ఇప్పుడు తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు తన పూర్తి మద్ధతు ఉంటుందన్నారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయనను వ్యతిరేకిస్తే.. రాహుల్ గాంధీని వ్యతిరేకించినట్లేనని ఆయన అభివర్ణించారు. సీఎల్పీ నేతగా బాధ్యతలు చేపట్టిన భట్టిలో తాము రాహుల్ గాంధీని చూస్తామని, రాహుల్ మంచి వ్యూహకర్తని కొనియాడారు.
ఇక అంతటితో ఊరుకోకుండా తెలంగాణలో సైతం ప్రియాంక గాంధీ ప్రభావం ఉంటుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రియాంక అయినా రాహుల్ అయినా మెదక్ నుంచి పోటీ చేస్తే గెలిపిస్తామని చెప్పిన జగ్గారెడ్డి తెలంగాణ ఇచ్చిన కుటుంబం మెదక్ నుంచి పోటీ చేస్తే కేసీఆర్ వారిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాలని కోరారు. ఒకపక్క కాంగ్రెస్ పార్టీ అంటేనే అంత ఎత్తున మండిపడుతున్న గులాబీ బాస్ కెసిఆర్ మెదక్ నుండి ఒకవేళ వాళ్ళు బరిలోకి దిగితే ఏకగ్రీవం అయ్యేలా సహకరిస్తారా? ఇక అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేస్తూ రోజుకో రకమైన రాజకీయ దుమారం రేపుతున్న జగ్గారెడ్డి ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం కట్టడి చేయలేక పోతున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న రాజకీయ నాయకుల పంధా ఇదే విధంగా కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగలక తప్పదు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article