అపర భగీరథుడు : ఒంటిచేత్తో కాల్వను తవ్వాడు

Bhuyan digging tonnel

బీహార్ లోని గయ జిల్లా కోతిలావా విలేజ్. గ్రామంలో ఒకే ఒక్క చెరువు. అన్నింటికీ దానిపై ఆధారం. ఉన్న కొద్దిపాటి నీళ్లు దీనికే సరిపోయేవి కావు. పంటలు అంతంతమాత్రమే పండేవి. చెరువున్నా భూములన్నీ బీడువారి కనిపిస్తాయి. ఈ పరిస్థితిని మార్చాలనుకున్నాడు అదే గ్రామానికి చెందిన భూయాన్.

ఊరిపక్కనే ఉన్న కొండపై నుంచి ప్రతిసారీ జారిపోయే వర్షపు నీటిని చెరువులోకి చేరిస్తే బాగుంటుందని భావించాడు. అలా చేయడానికి, కాల్వ తవ్వించే ఆర్థిక స్థోమత లేదు. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. ఇదే విషయం గ్రామస్తులతో చెప్తే ఎగతాళి చేశారు. కానీ భూయన్ మాత్రం పట్టుదల వదలలేదు. ఐదు కాదు… పది కాదు… ముప్పై ఏళ్లు కష్టపడి మూడు కిలోమీటర్ల కాలువ తవ్వి, చెరువులోకి నీరు తీసుకొచ్చాడు. నీటితో నిండిన చెరువును చూసి భూయాన్ మురిపోయాడు. తన కల నెరవేరిందంటూ ఊరంతా చెప్పాడు. ఒకప్పుడు కామెంట్స్ చేసిన గ్రామస్థులే భూయాన్ ను మెచ్చుకుంటున్నారు. కాటికి కాలు చాపే వయసులో ఒంటిచేత్తో కాల్వను తవ్వి ఎందరికో ఆదర్శమయ్యాడు. ఇప్పుడు భూయాన్, ఆయన తవ్విన కాల్వ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. బూయాన్ ‘యూ ఆర్ గ్రేట్’ అని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *