ఎలుకల్లో మనిషి మెదడు

Human Mind in Rat

ఎలుకల పుర్రెలో సూక్ష్మమైన మనిషి మెదళ్లను లేదా మనిషి మెదడు కణజాలాలను అమెరికా శాస్త్రవేత్తలు తొలిసారిగా వృద్ధి చేశారు.  ఇది మూలకణాల పరిశోధనా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించగలదని భావిస్తున్నారు. అలాగే ఆటిజమ్, డిమెన్షియా, స్కిజోఫ్రినియా వంటి నాడీ సమస్యలకు కొత్త చికిత్సలను రూపొందించటానికి తోడ్పడగలదని ఆశిస్తున్నారు. సాల్క్ ఇన్సిట్యూట్ శాస్త్రవేత్తలు మనుషుల మూలకణాలను సేకరించి ఎలుకల మెదడులో రక్తనాళాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో జొప్పించారు.  ఇలా ప్రవేశపెట్టిన మూలకణాలు నాడులుగా, నాడులకు దన్నుగా నిలిచే కణాలుగా ఏర్పడటం గమనించదగ్గ విషయం. ఈ కణజాలంలో రక్తనాళాలు పుట్టుకురావటమే కాకుండా వాటిల్లో రక్తం కూడా ప్రవహిస్తుండటం మరింత విశేషం. ఇలాంటి మెదడు కణజాలాన్ని వృద్ధి చేయటం ఇదే తొలిసారి.  ఇది తమకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందని, మెదడు కణజాలం ఎక్కువ కాలం సజీవంగా ఉంటుందనటానికిది సంకేతమని పరిశోధకులు పేర్కొన్నారు.  మానవ అవయవాలను, కణజాలాలను జంతువుల్లో ప్రవేశపెట్టి పరీక్షించటం చాలాకాలంగా జరుగుతున్నదే. అయితే తాజా పద్ధతితో మరింత అధునాతనమైన కణజాలాన్ని వృద్ధి చేయటానికి ఆస్కారముంటుందని పరిశోధకులు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article