ఏపీకి నెక్స్ట్ సీఎం ఆయనే

…12న ప్రకటిస్తానంటున్న గురూజీ

వినే వాళ్ళు ఉంటే చెప్పేవాళ్లు ఎన్నయినా చెప్తారు. ఇక తాజాగా ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో నెక్స్ట్ సీఎం ఎవరో చెబుతానంటూ ఓ ఆధ్యాత్మిక వేత్త హడావిడి చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అని ఇటు ప్రజలు, అటు నాయకులు ఎవరి అంచనాల్లో వారు ఉంటే , దైవశక్తి ద్వారా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని ప్రకటిస్తానని విశాఖకు చెందిన ఆధ్యాత్మికవేత్త ట్వింకిల్ శ్యామ్ షాకింగ్ న్యూస్ వెల్లడించారు. ఇప్పటికే తనకున్న దైవశక్తి ద్వారా రాష్ట్రంలో నెక్స్ట్ సీఎం ఎవరో తనకు తెలిసి పోయిందంటున్నారు ఈ ఆధ్యాత్మిక వేత్త. కేసీఆర్ కూడా దైవశక్తి ద్వారానే సీఎం అయ్యారంటూ చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 12వ తేదిన ఉదయం 3 గంటలకు హోమం నిర్వహించి ముఖ్యమంత్రిని ప్రకటిస్తానని ట్వింకిల్ శ్యామ్ తెలిపారు.
గాజువాకకు చెందిన ట్వింకిల్ శ్యామ్ ఓ ప్రైవేటు స్కూల్ అధినేత,అధ్యాత్మిక వేత్త. ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయం దైవశక్తి ద్వారా తనకు తెలిసిందంటున్నారు. విశాఖపట్నంలో బుధవారం నిర్వహించిన “మన అంతరాత్మ- మన ముఖ్యమంత్రి” అనే కార్యక్రమంలో ఈ విషయాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి అయ్యే పార్టీ కార్యాలయానికి 11వ తేదిన ఫ్యాక్స్ లో హోమానికి సంభందించిన లేఖ పంపుతానని ఆయన తెలిపారు. ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో కాబోయే ముఖ్యమంత్రి, ఇతర పార్టీ నాయకులు, పోటీ చేసే ఎమ్మేల్యే అభ్యర్థులు, ఎంపీలు, అందరు హొమంలో పాల్గొనడం ద్వారా దైవశక్తి తో వారే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోశ్యం చెప్పారు. ఈ హోమంలో ఎవ్వరు పాల్గొంటారో వారే ముఖ్యమంత్రని, అది ఫిబ్రవరి 12 ఉదయం ప్రకటిస్తానని శ్యామ్ అంటున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article