ఏపీ ఇసుక తవ్వకాలపై నివేదిక కోరిన…

96

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ నివేదిక కోరింది. కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు అనుసరిస్తున్న తీరును జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్ జీటీ) తప్పు బట్టింది. ఆ సంస్థల నివేదికలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై రైతు ప్రతినిధి అనుమోలు గాంధీ జాతీయ హరిత ట్రైబ్యునల్ లో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఎన్ జీటీ దీనిపై విచారణ జరిపింది. ఇసుక తవ్వకాలపై జరిపిన అధ్యయనం వివరాలు, చర్యలపై నెలరోజుల్లో నివేదిక రూపంలో తమకు సమర్పించాలని ఆదేశించింది. లేనిపక్షంలో రూ.100 కోట్ల జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణను 2020 ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది.

tags :andhrapradesh,  illegal sand mining , national green tribunal, report ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here