ఏ త‌లుపును ఎంచుకోవాలి?

(ప్రకటన 3:7-13)
ప్రభువు ఫిలదెల్ఫియ సంఘమునకు, ”ఎవడు వేయలేకుండా తీయువాడును, ఎవడు తీయలేకుండా వేయువాడును”, అని తన గూర్చి చెప్పుకొనుచుండెను. మనము జయించువారమైతే, ఒక ద్వారము ద్వారా వెళ్ళుట ప్రభువు చిత్తమైతే వేయబడిన ఒక తలుపు వద్ద నిలిచియుండవలసిన అవసరం లేదు. కాని ప్రభువు కొన్ని తలుపులను మూసివేయును. కనుక ఆయన మన కొరకు ఉద్దేశించని త్రోవల గుండా, మనకు ప్రయోజనముకానివని ఆయనకు తెలిసిన వాటిగుండా మనము వెళ్లనవసరము లేదు. జయించే జీవితం నిజముగా సంతోషకరమైనది. ప్రభువు మనము ఏ తలుపు గుండా వెళ్ళాలో, ఏ తలుపుగుండా వెళ్ళకూడదో నిర్ణయిస్తాడు.

ఫిలదెల్ఫియ సంఘము విషయములో హెచ్చరిక అక్కరలేని రెండవ సంఘపు పెద్దను మనము చూస్తున్నాము. మొదటిది స్ముర్న సంఘము. ఈ రెండు ఉదాహరణలు ప్రభువు మరలా వచ్చినపుడు ఎటువంటి గద్దింపును పొందకుండా ఒక సంఘపు పెద్దగాను మరియు సంఘముగాను ఉండుట సాధ్యమే అని చూపిస్తున్నాయి. ఇది మనకు సవాలుగా ఉన్నది.

ఇక్కడ ఉన్న సంఘపు పెద్ద మరియు సంఘము బలహీనులు (ప్రకటన 3:8). వారికి పలుకుబడి మరియు శక్తి తక్కువగా ఉన్నప్పటికీ వారు వాక్యమును గైకొని ప్రభువు నామమును ఒప్పుకొన్నారు. ఈ రెండు మనముండిన ప్రస్తుత దినాలలో చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే మరలా మరలా ప్రకటన గ్రంథములో వ్రాయబడినవి. అవి:

”వాక్యమునకు విధేయత మరియు ప్రభువైన యేసు నామమును ఒప్పుకొనుట”.

వారి నమ్మకత్వాన్ని బట్టి ప్రభువు ఈ విధంగా చెప్పుచున్నాడు. వారు సాక్షులుగా ఉండునట్లు తలుపు తీసెదను దానిని ఎవడును వేయనేరడు (ప్రకటన 3:8). వారి సాక్ష్యాన్ని సాతాను ఎదిరిస్తాడు కాని పాతాళలోక ద్వారములు ఆ సంఘము ఎదుట నిలువనేరవు. ఈ సంఘము సాతాను కూడా భయపడే విధంగా జయించిన సంఘం. సాతాను సమాజపు వారు స్ముర్న సంఘమువలె ఈ సంఘమును కూడా వ్యతిరేకించారు.

గమనించదగిన విషయం – ఆసియలోని ఏడు సంఘములలోని ప్రభువు మెచ్చుకున్న ఈ రెండు సంఘాలను సాతాను సమాజము వ్యతిరేకించింది. దేవుణ్ణి సంపూర్ణముగా వెంబడించే సంఘములనే, ముఖ్యముగా మతానుసారుల ద్వారా సాతాను వ్యతిరేకిస్తాడు. “నా నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు కాని, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని,మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు”(మత్తయి 10:28,30;లూకా 21:18) అని యేసు చెప్పెను. దేవుని అనుమతి లేకుండా శ్రమల కాలములో కూడా మన తల వెంట్రుకలలో ఒకటి కూడా నశింపదు కాబట్టి మనము విశ్రాంతిలో ఉండవచ్చును.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article