Comedian Ali to join in YCP the Date was Fix
కమెడియన్ కమ్ హీరో ఆలీ వైసీపీలో చేరనున్నారు. జగన్ శ్రీకాకుళం జిల్లా పాదయాత్ర ముగింపు రోజు పార్టీ తీర్ధం తీసుకోనున్నారు. తాజాగా ఆలీ జగన్ ను కలిసి తన రాజకీయ ఆసక్తి పై జగన్ తో మాట్లాడారు. మొన్న జగన్ తో కలిసిన ఆలీ రాజకీయంగా ఒక అడుగు ముందుకు వేశారు. ప్రముఖ సినీ నటుడు అలీ.. వైసీపీలో చేరనున్నారు. ఈ నెల 9వ తేదీన జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగియనుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఈ పాదయాత్రను జగన్ ముగింపు పలకనున్నారు. కాగా.. అదే రోజు అలీ.. జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పుడు ఈ వార్త ఏపీ రాజకీయాల్లో చర్చ కు కారణం అవుతుంది. ఇక ఆలీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి . గత కొంత కాలం వరకు టిడిపి సానుభూతిపరునిగా ఉన్న ఆయనకు పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఇక ఆ తరువాత పవన్ తో తిరిగారు. ఆయన జనసేన లో చేరతారు అనే వార్తలు సైతం వచ్చాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో ఎక్కడైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారని రాజకీయ పార్టీల్లో చాలా కాలంగా చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఆలీ రొట్టెల పండుగ లో పాల్గొనడంతో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి పోటీ చేస్తారని టాక్ బాగా వినిపించింది. . ఒకవేళ ఆలీ పోటీ చేస్తే మాత్రం తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ తరఫున ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ తరఫున పోటీ చేస్తారు అని కూడా అందరూ అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అయితే తాజాగా పవన్ కు, ఆయన అభిమానులకు షాక్ ఇస్తూ ఆలీ పాద యాత్రలో ఉన్న వైకాపా అధినేత జగన్ ని కలిశారు. దీంతోఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆలీ జగన్ ను కలవటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ ని కలిసి పాద యాత్ర పూర్తి అయ్యాక 35 నిమిషాల పైన చర్చించినట్టు ఆలీ టికెట్ కోసం జగన్ తో మాట్లాడారు. అయితే ఇద్దరి మధ్య జరిగిన ఈ సమావేశం వివరాలు పూర్తిగా బయటకు రాకపోయినా వైకాపా తరపున ఆలీ పోటీ లాంఛనమనే తెలుస్తుంది. ఇక ఆలీ మాత్రం అసలు విషయాన్ని కప్పి పుచ్చి మైనారిటీల సమస్యలు చర్చించటానికి వచ్చానని, రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పి వెళ్ళిపోయారు. కానీ మీడియా ప్రతినిధులు లాగిన కూపీ ప్రకారం ఆలీ రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ కి అవకాశం కోరినట్టు తెలుస్తుంది. ఇక జగన్ కూడా సానుకూలముగా స్పందించారని టాక్ వినిపిస్తుంది.
ఇప్పుడు ఆలీ వచ్చే ఎన్నికల్లో పోటీ లో ఉంటున్నారనే వార్తను నిజం చేశారు. జగన్ ఆదేశిస్తే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా తాను సిద్ధమంటూ అలీ తన సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. గత నెలలో జగన్ ని ఆలీ కలిసినప్పుడు ఆయనతో మంతనాలు జరిపారు. జగన్ చేపట్టిన పాదయాత్రపై అలీ ప్రశంసలు కురిపించారు. నిత్యం ప్రజల్లో ఉండాలనే తపనతో ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని అలీ అభిప్రాయపడ్డారు. అలాగే పాదయాత్రలో పార్టీకి వస్తున్న మైలేజ్ పై కూడా ఇరువురు చర్చించుకున్నారు ఇక ఆలీ వైసీపీ తీర్ధం తీసుకోవటం ఖాయంగా కనిపిస్తుంది. ముహూర్తం కూడా నిర్ణయం అయ్యింది. దీంతో జనసేనానికి షాక్ తగిలింది.