గల్వాన్ మృతులు నలుగురే: చైనా

386

భారత్, చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో తమ సైనికులు నలుగురు చనిపోయారని చైనా తెలిపింది. ఘటన జరిగిన దాదాపు 9 నెలల తర్వాత డ్రాగన్ దేశం ఈ వివరాలు వెల్లడించడం విశేషం. గతేడాది జైన్ లో తూర్పు లడఖ్ ఘర్షణల్లో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు చైనా మిలటరీ వెల్లడించినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఆ ఘర్షణల్లో షిన్ జియాంగ్ మిలటరీ కమాండర్ కీ ఫబావోతోపాటు చెన్ హోంగ్జన్, చెన్ షియాన్ గ్రాంగ్, షియాలో సియువాన్, వాంగ్ జురాన్ ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. వారందరికి గౌరవ హోదాలు కల్పించినట్టు చెప్పింది. అలాగే ఆ ఘర్షణలో ఆర్మీని ముందుడి నడిపించి తీవ్రంగా గాయపడిన కల్నల్ కు సముచిత గౌరవం కల్పించినట్టు తెలిపింది. కాగా ఆ ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. చైనా సైనికులు కూడా భారీగానే చనిపోయినా.. ఆ దేశం మాత్రం వివరాలు వెల్లడించలేదు. దాదాపు 45 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here