డిజైన‌ర్‌కు త‌ప్పిన పెను ప్ర‌మాదం

Designer Escaped from Disaster…
ప్ర‌ముఖ డిజైన‌ర్, స్టైలిష్ట్ ప‌ల్ల‌వి సింగ్‌కు గ‌త రాత్రి పెను ప్ర‌మాదం త‌ప్పింది. చెన్నై నుండి ముంబై వ‌చ్చే క్ర‌మంలో ఆమె ఉబ‌ర్ కారును బుక్ చేసుకున్నారు. కారులో ప్ర‌యాణిస్తుండ‌గా టిటికే ఫ్లై ఓవ‌ర్ ద‌గ్గ‌ర‌కు రాగానే.. కారు నుండి మంట‌లు వ‌చ్చింది. తోటి ప్ర‌యాణీకుల నుండి విష‌యాన్ని తెలుసుకున్న ప‌ల్ల‌వి సింగ్ కారు నుండి వెంట‌నే దిగిపోయి ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డింది. ఘ‌ట‌న సంబవించి 12 గంట‌ల‌వుతోన్న ఉబ‌ర్ సంబంధిత అధికారులు స్పందించ‌లేద‌ట‌. ఉబ‌ర్ త‌మ ప్ర‌యాణీకుల ప‌ట్ల కేర్ తీసుకుంటుంద‌ని అనుకునేవారు ఈ విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాల‌ని ప‌ల్ల‌వి సింగ్ తెలిపారు.  ఆమె తమిళ హీరో‌ విజయ్‌ తదితర నటులకు డిజైనర్‌, స్టైలిస్ట్‌గా పనిచేస్తున్నారు. సినీ ప్రముఖులు‌ సమంత, కల్యాణి ప్రియదర్శన్‌, మాంజిమా మోహన్‌ తదితరులు పల్లవి సింగ్ ఆరోగ్యం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరా తీశారు
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article