త్వరలో 2 వేల రూపాయల నోట్ల రద్దు  

2k note is ban
2k note may be banned
centre plans to ban 2k note
కేంద్రం సంచనల నిర్ణయాలతో దేశ ప్రజలను ఆలోచనలో పడేస్తోంది.గతంలో పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర సర్కార్ అంత కంటే పెద్ద నోటును మార్కెట్ లోకి విడుదల చేసింది. రూ.2 వేల నోటునువిడుదల చెయ్యటం పై పలు విమర్శలను కూడా ఎదుర్కొంది. ఇక తాజాగా దశల వారీగా  2 వేల రూపాయల నోటు లేకుండా చెయ్యాలని నిర్ణయం తీసుకుంది . ఎన్నికల సమయం లో తీసుకున్న అనూహ్య నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో . అసలు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక అసలు కారణం ఏంటో అని దేశ వ్యాప్త చర్చ జరుగుతోంది.
2వేల రూపాయల నోటును కేంద్రం త్వ‌రలోనే ర‌ద్దు చేయ‌నుందా?.. రూ.2 వేల నోటును ర‌ద్దు చేస్తారంటూ వ‌స్తున్న వార్త‌లు త్వ‌ర‌లోనే నిజం కానున్నాయా?.. అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా తీసుకున్న నిర్ణ‌యాన్ని బ‌ట్టి చూస్తే త్వ‌ర‌లోనే రూ.2 వేల నోటు ర‌ద్దు అంటూ వ‌స్తున్న వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరేలా ఉంది.పాత నోట్లను ర‌ద్దు చేస్తూ చారిత్రాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, వాటి స్ధానాల్లో కొత్త నోట్ల‌ను చ‌లామ‌ణిలోకి తీసుకొచ్చారు.కొత్తగా రూ. 2 వేల  నోట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టారు.ఆ స‌మ‌యంలోనే ఏ క్ష‌ణంలోనైనా రూ.2 వేల నోటునుర‌ద్దు చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ వార్త‌లకు బ‌లం చేకూరుస్తూ కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రూ.2 వేల నోట్లముద్రణను నిలిపివేయాల్సిందిగా భారతీయ రిజర్వు బ్యాంకు ను కేంద్రం ఆదేశించింది. ప్ర‌స్తుతం నిలిపివేయాల‌ని ఆదేశాలు ఇచ్చిన కేంద్రం, త్వ‌ర‌లోనే ర‌ద్దు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఒకేసారి నోట్ల‌ను ర‌ద్దు చేస్తే విమ‌ర్శ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున‌.. ముందు నోట్ల ప్రింటింగ్‌ను ఆపివేసి, ఆ త‌ర్వాత ర‌ద్దు ప్ర‌క‌టన చేస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది.మ‌రికొద్ది నెల‌ల్లో లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌త్య‌ర్ధల‌ను దెబ్బ‌కొట్టేందుకే కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌నే  భావన  క‌లుగుతోంది. ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌కు ఎన్నిక‌ల్లో డ‌బ్బు ల‌భించ‌కుండా చేసేందుకు మోదీ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌నే వాద‌న‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల రాజకీయమో , లేకా మరే ఇతర కారణాలు ఉన్నాయో కానీ నోట్ల రద్దు నిర్ణయాలతో కేంద్ర సర్కార్ ఇప్పటికే చాలా నష్టపోయింది. ముందు ముందు పరిస్థితి ఎలా వుండనుందో .
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article