నయావాల్‌.. నయా రికార్డులు

సిడ్నీ: ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా అదరగొట్టాడు. ఆసీస్‌ బౌలర్లను ఎదుర్కొంటూ శతకం పూర్తి చేశాడు. దీంతో తన టెస్టు కెరీర్‌లో 18వ శతకాన్ని, ఈ ఏడాదిలో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పడుతున్నప్పటికీ పుజారా మాత్రం నిలకడగా ఆట కొనసాగించాడు. ఈ క్రమంలో కొత్త రికార్డును పుజారా నమోదు చేశాడు.

మూడో స్థానంలో వచ్చిన బ్యాట్స్‌మన్లలో అత్యధిక సెంచరీలు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా పుజారా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు మూడో నంబరులో వచ్చిన బ్యాట్స్‌మన్‌ ఒకే సిరీస్‌లో మూడు సెంచరీలు పూర్తి చేసుకోవడం కూడా ఇదే తొలిసారి. ఇక ఈ సిరీస్‌లో పుజారా 200 బంతులకు పైగా ఆడటం ఇది నాలుగో సారి. దీంతో సునీల్‌ గావస్కర్‌  రికార్డును పుజారా అధిగమించాడు. 1977-78లో ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గావస్కర్‌ మూడు సార్లు 200 బంతులకు పైగా ఆడారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article