న్యూడ్ కాల్ చేశాడు.. అడ్డంగా బుక్కయ్యాడు

213

ఓ యువతి కోరిక మేరకు నగ్నంగా వీడియో కాల్ లో కనిపించిన యువకుడు ఆపై ఆమెకు అడ్డంగా బుక్కయ్యాడు. కర్ణాటకలోని దక్షిణ బెంగళూరు హులిమావులోని ఆర్ఆర్ లేఅవుట్ కు చెందిన 33 ఏళ్ల యువకుడికి జీవన్ శాంతి అనే మ్యాట్రిమోని సంస్థలో శ్రేయ అనే యువతి పరిచయమైంది. ఒకరి వివరాలు మరొకరు తెలుసుకున్న తర్వాత ఇరువురూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. రోజూ చాటింగ్, ఫోన్లలో మునిగి తేలారు. ఈ క్రమంలో శ్రేయ.. అతడిని ఓ వింత కోరిక కోరింది. తాను అతడిని నగ్నంగా చూడాలనుకుంటున్నట్టు చెప్పింది. తాను కూడా అలా కనపడతానని చెప్పింది. ఆ మేరకు తన న్యూడ్ ఫొటో ఒకటి అతడికి పంపించింది. దీంతో అతడు కూడా వీడియోకాల్ చేసి నగ్నంగా కనపడ్డాడు. అదంతా రికార్డు చేసిన ఆమె.. రూ.లక్ష ఇవ్వకుంటే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది. దీంతో అతడే మూడు విడతలుగా రూ.20వేలు సమర్పించుకున్నాడు. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను వెతికే పనిలో పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here