న‌య‌న‌తార త‌ల‌రాత‌ను ఆరుగురు రాశారా?

కోలీవుడ్‌లో లేడీ సూప‌ర్‌స్టార్‌గా పిల‌వ‌బ‌డే న‌య‌న‌తార త‌ల‌రాత‌ను ఆరుగు రాయ‌డ‌మేంట‌ని ఆలోచన వ‌స్తుందా.. అస‌లు విష‌య‌మేమంటే ఈ డైలాగ్ ఆమె న‌టించిన ఐరా చిత్రంలోనిది. హీరోల‌తో ఆడి పాడ‌ట‌మే కాదు.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా న‌టిస్తూ సూప‌ర్‌హిట్స్ సాధిస్తున్న హీరోయిన్ నయ‌న‌తార‌. ఈమెకు త‌మిళ‌నాట క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతూ వ‌స్తుంది. తాజాగా ఈమె న‌టిస్తోన్న చిత్రం `ఐరా`. ఈ సినిమాను తమిళంతో పాటు ఏక కాలంలో తెలుగులో కూడా విడుద‌ల కానుంది. అందుక‌నే తెలుగు ట్రైల‌ర్‌ను కూడా త‌మిళ ట్రైల‌ర్‌తో కూడా విడుద‌ల చేశారు. మ‌ళ్లీ ఆడ‌పిల్ల పుట్టిందిరా.. అయ్యో ఆడ‌పిల్ల‌
అమ్మా నాకు భ‌యంగా ఉంది..
నాకే తెలియ‌ని ఆరుగురు నా త‌ల‌రాత త‌ల‌క్రిందులుగా రాశారు..
ఆనందంగా బ్ర‌త‌క‌డం ఒక క‌ల‌. అయితే సంతోషం అంటే తెలియ‌ని నాకు బ్ర‌త‌క‌డ‌మే క‌ల‌..
అనే డైలాగ్స్‌తో న‌య‌న‌తార పాత్ర‌లోని డెప్త్ అర్థ‌మ‌వుతుంది. సార్జున్‌.కె.ఎం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది.
ఒక పాత్ర‌లో మోడ్ర‌న్ లుక్‌తో.. మ‌రో పాత్ర‌లో అమాయ‌కంగా  క‌న‌ప‌డ‌తుంది. క‌లైర‌స‌న్‌, యోగిబాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా హార‌ర్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా క‌న‌ప‌డుతుంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article