పంచాయతీ అసలు గెలుపు టీడీపీదే: లోకేష్

258
RK VS Lokesh
WHATS LOKESH LATEST SATIRE ON YS JAGAN?

పంచాయతీ ఎన్నికల్లో అసలు సిసలు టీడీపీదేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీలో నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల పోరు ముగిసిన అనంతరం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘డెమోక్రసీకి, జగన్ మోనోక్రసీకి మధ్య జరిగిన ఎన్నికల్లో కొంత తేడాతో సంఖ్యా విజయం వైసీపీదైనా, అసలు సిసలు గెలుపు టీడీపీదే. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన ఎన్నికలను వైఎస్ జగన్ తన రాజారెడ్డి రాజ్యాంగంతో అడ్డుకున్నారు. మనదేశానికి అర్ధరాత్రి స్వాతంత్ర్యం వస్తే, నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలిటిక్స్ కి స్వాతంత్ర్యం వచ్చింది. టీడీపీ మద్దతుతో పోటీచేసే అభ్యర్థుల్ని చంపేశారు. నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేశారు. బెదిరించారు, భయపెట్టారు, కట్టేసి కొట్టారు. అయినా వెనక్కి తగ్గని టీడీపీ అభ్యర్థులు లెక్కింపులో ముందంజలో ఉంటే, కరెంట్ నిలిపేశారు. కౌంటింగ్ కేంద్రాలకు తాళాలేశారు. పోలీసులతో బెదిరించారు. దాడులు చేశారు. టీడీపీ మద్దతుదారులు గెలిచిన చోట్ట రీకౌంటింగ్ పేరుతో వైసీపీ గెలుపు ప్రకటించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఎన్నడూ లేని విధంగా జగన్ రెడ్డి అరాచకాలకు పాల్పడినా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచిన టీడీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను’ అని లోకేష్ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here