పురుష గర్భనిరోధక మాత్రపై ముందడుగు

Proceed on the male contraceptive pills

గర్భం రాకుండా చూడటానికి పురుషుల కోసం మాత్రలను తయారుచేయటంలో మరో ముందడుగు పడింది. ఇపి055 అనే రసాయనం హార్మోన్లకు ఎలాంటి హాని కలిగించకుండా వీర్యకణాలను నిలువరిస్తున్నట్టు బయటపడింది. ఇది వీర్యంలోని ప్రోటీన్లకు అంటుకుపోయి వీర్యకణాల కదలికలను గణనీయంగా తగ్గిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అందువల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలిగించని ‘మగ మాత్ర’ తయారీకి ఇపి055 సమర్థవంతంగా ఉపయోగపడగలదని భావిస్తున్నారు.  సులభంగా చెప్పాలంటే.. ఈ రసాయం వీర్యకణాలు ఈదే సామర్థ్యాన్ని ఆపేస్తూ ఫలదీకరణ అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.  హార్మోన్ రహిత పురుష గర్భనిరోధక మాత్ర తయారీకి ఇది బాగా ఉపయోగపడగలదని వివరిస్తున్నారు.  ప్రస్తుతం పురుషుల్లో సంతాన నిరోధానికి కండోమ్, వాసెక్టమీ ఆపరేషన్ పద్ధతులే అందుబాటులో ఉన్నాయి. వీర్యం ఉత్పత్తిని ఆపటానికి హర్మోన్ మందులపై ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయి కానీ అవి సహజ హార్మోన్ల మీదా విపరీత ప్రభావం చూపుతున్నాయి.  అయితే ఇపి055 రసాయనం వీర్యకణాలపై తాత్కాలికంగానే ప్రభావం చూపుతున్నట్టు కోతులపై చేసిన అధ్యయనంలో బయటపడింది. అంటే దీన్ని తీసుకోవటం ఆపేస్తే వీర్యకణాల కదలికలు తిరిగి మామూలు స్థాయుకి వచ్చేస్తున్నాయన్నమాట.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article