పోలవరం రీ టెండర్ల పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి

56

 

పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జల శక్తి వనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు చేశారు . పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల రద్దు ఎఫెక్ట్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పడుతుందని లోక్ సభ వేదికగా ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయం పోలవరం ప్రాజెక్టుకు కొత్త అవరోధం అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభిప్రాయపడ్డారు.
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కుదుర్చుకున్న టెండర్లను రద్దు చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో పోలవరం ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే ఈ విషయంలో టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 70 శాతం పనులు పూర్తయ్యాయని 30 శాతం పనులు పూర్తి చేసినట్లయితే నవ్యాంధ్ర జీవనది అయిన పోలవరం ప్రాజెక్టు సాగునీరు, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తుందని వారి వాదన. కానీ ప్రభుత్వ నిర్ణయంతో అది సాధ్యమయ్యేలా లేదని , వైసిపి ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశాన్ని పోలవరం తాజా పరిస్థితిని లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లేవనెత్తారు.
పోలవరం అంశం పై మాట్లాడిన మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టు టెండర్లను రద్దు చెయ్యటం అత్యంత బాధాకరమైన విషయంగా పేర్కొన్నారు . టెండర్ల రద్దుతో నిర్మాణ వ్యయం, సమయం రెండు పెరిగే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణానికి ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని జల శక్తి వనరుల మంత్రి షెకావత్ అభిప్రాయపడ్డారు.
పోలవరం ప్రాజెక్టులో నామినేషన్‌ ప్రాతిపదికపై నవయుగ, బెకం సంస్థలు నిర్వహిస్తున్నటెండర్లను రద్దు చేసేందుకు రాష్ట్ర జలవనరులశాఖ ఆ రెండు సంస్థలకు నోటీసులు ఇచ్చింది. నామినేషన్‌ ప్రాతిపదికపై పనులు అప్పగించడం సరైనది కాదన్న కారణంతోనే వారిని ప్రస్తుతం పనుల నుంచి తొలగిస్తున్నట్లు పోలవరం ప్రాజెక్టు అధికారులు వివరించారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు పై నిపుణుల కమిటీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టర్లకు అనవసరపు చెల్లింపులు చేశారని, రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని సూచనలు చేసిన నేపథ్యంలో కొత్తగా టెండర్లు పిలిచి ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కానీ పోలవరం రీ టెండర్ల వల్ల పోలవరానికి నష్టం జరుగుతుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

AMAZING FACTS

tags : union minister, gajendra singh shekavath , polavaram project , re tenders issue , comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here