ప్రతిపక్షాలపై ప్రధాని ఫైర్

8
TRS ATTACK ON BJP
TRS ATTACK ON BJP

దేశంలో అన్నదాతల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వారి సంక్షేమం కోసమే వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టి కొత్త చట్టాలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. గతంలో వీటికి అనుకూలంగా ఉన్న ప్రతిపక్షాలు.. ఇప్పుడు కావాలనే వాటిని వ్యతిరేకిస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ సోమవారం రాజ్యసభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ దశాబ్దానికే మార్గనిర్దేశం చేసిందని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు నిలిచిపోయాయని, ఈ నేపథ్యంలోనే తాము వారి సంక్షేమం కోసం కొత్త చట్టాలు తెచ్చామన్నారు.

చిన్న, సన్నకారు రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని తెలిపారు. కొత్త చట్టాల్లో అభ్యంతరాలు ఏమిటో చెబితే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సభ నుంచే రైతులను చర్చలకు ఆహ్వానిస్తున్నానని.. వెంటనే ఆందోళన విరమించాలని కోరారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. రైతులకు స్వేచ్ఛాయుత మార్కెట్ అవకాశాలు కల్పించాలని చెబుతూ ఉండేవారని గుర్తుచేశారు. ఆయన కోరుకున్నది మోదీ చేస్తున్నందుకు గర్వపడాలి అంటూ కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.