పవన్ కేసీఆర్ భేటీ పై విజయశాంతి షాకింగ్ ట్వీట్

VIjayaSanti shocking comments on KCR and Pavan Kalyan Meet

గణతంత్ర దినోత్సవ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తో అటు కేటీఆర్, ఇటు కేసిఆర్ లు చర్చలు జరపడం హాట్ టాపిక్ గా మారింది. ఫెడరల్ ఫ్రంట్ లో పవన్ కళ్యాణ్ ను భాగస్వామ్యం చేయడానికి, కెసిఆర్ కేటీఆర్ లు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వ్యూహం వెనుక జగన్, పవన్ లను కలపాలని కెసిఆర్ ఆలోచన ఉన్నట్టు తెలంగాణ రాములమ్మ చేసిన ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది.ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు..తమ ప్రభావం ఎంతుందో చూపేందుకు ప్రయత్నిస్తున్న జనసేనాని అధినేత పవన్‌పై సినీ నటి, కాంగ్రెస్ లీడర్ విజయశాంతి ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్‌ను ఏదో రకంగా వివాదాల్లోకి లాగేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందంటూ పేర్కొన్నారు. ఈమె చేసిన ట్వీట్లు ఇటు తెలంగాణ..అటు ఏపీలో హాట్ టాపిక్ అయ్యాయి.
ప్రజారాజ్యం పొత్తు వద్దని టీడీపీతో 2009లో జత కట్టిన కేసీఆర్ గురించి సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి పవన్‌కి టీఆర్ఎస్ జిత్తులపై బాగానే క్లారిటీ ఉంటుందేమో. పవన్ అంత త్వరగా కేసీఆర్ ఉచ్చులో పడకపోవచ్చు. ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితుల్లో… రాజ్ భవన్‌లో కేసీఆర్ గారు, పవన్ కళ్యాణ్‌తో మంతనాలు జరపడం మరింత గందరగోళానికి కారణమయింది. ఇంతకీ ఏపీకి వెళ్ళి జగన్‌తో ఫెడరల్ ఫ్రంట్ పై చర్చిస్తానన్న కేసీఆర్…అంతకు ముందే పవన్ కళ్యాణ్‌తో మంతనాలు జరపడం ద్వారా ఏమి మెసేజ్ ఇవ్వదలచుకున్నారు ? కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చెయ్యడం కంటే వైసీపీ, జనసేన లను ఒకే వేదిక మీదకు తేవడమే కేసీఆర్ అసలు అజెండాగా కనిపిస్తోంది’.అంటూ ట్వీట్ చేశారు. మరి రాములమ్మ చేసిన ఈ నయా ట్వీట్స్‌పై గులాబీ బాస్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Check Out Latest Offers in Amazon

For more Filmy News

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article