బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర

6

హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లికి రెండున్న కిలోల బంగారంతో తయారు చేయించిన చీరను సమర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ నేత కూన వెంకటేష్ గౌడ్, శివరామకృష్ణారెడ్డి కలిసి 2.5 కిలోల బంగారంతో ఓ చీరను తయారుచేయించారు. బెంగళూరులో అద్భుతంగా తయారైన ఈ చీరను బుధవారం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించారు.