బిచ్చమెత్తి అయినా పూర్తి చేస్తా

228
KCR AT NAGARJUNA SAGAR ELECTIONS WITH BAGATH
KCR AT NAGARJUNA SAGAR ELECTIONS WITH BAGATH

బిచ్చెమెత్తి అయినా నెల్లికల్లు లిఫ్ట్ పూర్తి చేస్తా.. నిర్ణీత గడువు లోపు పూర్తి చేయలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన మంత్రి జగదీష్ రెడ్డి ఛాలెంజ్ ను సమర్దిస్తున్నా.. ఆయన ప్రకటనలో నిజాయితీ, ధైర్యం ఉందంటూ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హాలియలో జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రైతాంగంలో మనో ధైర్యాన్ని నింపాయి.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో నెల్లికల్లు లిఫ్ట్ గురించి..

‘‘ఎట్లెట్ల భగత్ కు ఓట్లు దుంకుతాయో…అట్లట్ల మీ నెల్లికల్లుకు నీళ్లు దుంకుతాయని మీకు హామీ ఇస్తున్న. మంత్రి గారు ఆల్రెడీ ఛాలెంజ్ చేసిండు. ఆయనకు ధైర్యం ఉంది కాబట్టి, నిజాయితీ ఉంది కాబట్టి.. ఒకటిన్నర సంవత్సరంలోపు పూర్తి చేయకపోతే తన పదవికి రాజీనామా చేస్తా అని ఆయన చెప్పడం జరిగింది. వంద శాతం ఆయన కరెక్ట్ గానే చెప్పిండు. మా మంత్రి గారి ప్రకటనను సమర్దిస్తూ మీకు హామీ ఇస్తున్న.. ఎక్కడ బిచ్చమెత్తి అయినా సరే ఆ లిఫ్ట్ పూర్తి చేయించే బాధ్యత నాది అని మనవి చేస్తున్న.’’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here