మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. 32 మంది మృతి

4

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి కాల్వలో పడిపోవడంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. సిధి జిల్లాలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వంతెన పైనుంచి శారదా కాల్వలోకి పడిపోయింది. ఆ సమయంలో బస్సులో దాదాపు 60 మంది ఉండగా.. ఏడుగురు ఓడ్డుకు చేరుకున్నారు. ఇప్పటివరకు 32 మంది మృతదేమాలను వెలికితీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు.