రెండు రాష్ట్రాల హైకోర్టుల సేవలు ఆరంభం

Andhra Pradesh and Telangana High Court Services

నూతన శకం …

అవిభాజ్య తెలుగు రాష్ట్రంలో కటిగా ఉన్న హైకోర్టు విభాజిత రాష్ట్రాల్లో రెండుగా ఏర్పాటు కావటానికి ఇంత సమయం పట్టింది. తెలంగాణ విడిపోయి నాలుగున్నరేళ్లు అయ్యింది. రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అయినా విడిపోకుండా ఉన్న ఉమ్మడి హైకోర్టు కొత్త సంవత్సరం వేళ ఆ తంతును పూర్తి చేసుకుంది. జనవరి 1 నుంచి రెండు రాష్ట్రాలకు కొత్త హైకోర్టులు ఏర్పడ్డారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నవశకం ఆవిష్కృతమైంది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ సమాజం ఏ విధంగానైతే సంబరాలు చేసుకున్నారో.. ఇప్పుడు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు సందర్భంగా తెలంగాణ సమాజం అంతే హర్షం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నింటికి ఉమ్మడి హైకోర్టులోని కొందరు న్యాయవాదులు మోకాలడ్డుతున్నారని టీఆర్ఎస్ గుర్రుగా ఉండేది. అందుకే ప్రత్యేక హైకోర్టు కోసం వారు ఢిల్లీ స్థాయిలో పోరాడారు. చివరకు నూతన సంవత్సరంలో సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన న్యాయవాదులు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుతో కోర్టు ప్రాంగణంలో సంబరాలు చేసుకుంటున్నారు. నేటి నుంచి తెలంగాణ హైకోర్టు సేవలందించబోతోంది.
సోమవారం ఉదయం అధికారికంగా ఏపీ తెలంగాణ హైకోర్టులు ఏర్పడ్డాయి.. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులు నేటి నుంచి వేరువేరుగా సేవలందించబోతున్నాయి. తెలంగాణ తొలి చీఫ్ జస్టిస్ గా సోమవారం ఉదయం జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు న్యాయవాదులు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం పూర్తికాగానే గవర్నర్ నరసింహన్ ఏపీకి ప్రత్యేక హెలీక్యాప్టర్ లో బయలు దేరారు. సోమవారం ఉదయం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణం చేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ ప్రవీణ్ కుమార్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు న్యాయమూర్తులు న్యాయవాదులు హాజరయ్యారు. ఏపీ తెలంగాణ ఒక్కటి కాకముందు ఏపీకి సొంతంగా హైకోర్టు ఉండేది. దాదాపు 60 ఏళ్ల తర్వాత మళ్లీ నవ్యాంధ్రలో హైకోర్టు సేవలు తిరిగి కొనసాగుతుండడం విశేషం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article