రెండో టెస్టులో భారత్ గెలుపు

10

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న రెంటో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన భారత క్రికెట్ జట్టు.. ఇంగ్లండ్ పై 317 పరుగుల భారీ విజయం నమోదు చేసుకుంది. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1లో సమంగా ఉన్నాయి. తొలి టెస్టులో పరాజయం పాలైన భారత క్రికెట్ జట్టు.. రెండో టెస్టులో మాత్రం సత్తా చాటింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 134 పరుగులకే ఆలౌట్ అయి వెనకబడింది.

రెండో ఇన్నింగ్స్ లో మన జట్టు 286 పరుగులు చేసి, ఇంగ్లండ్ కు 482 పరుగులు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఇచ్చింది. స్పిన్నర్లకు పిచ్ బాగా అనుకూలించడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. అయినా 164 పరుగులు మాత్రమే చేయగలిగి ఓటమి చవిచూసింది. భారత బౌలర్లు అక్షర్ పటేల్ 5 వికెట్లు తీయగా.. అశ్విన్ 3 వికెట్లు, కుల్ దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ సెంచరీ చేయడం విశేషం.