రేపు ఢిల్లీ వెళ్లనున్న జగన్

Jagan Going to Delhi … ఎందుకంటే

ఏపీలో ఎన్నికల సమీపిస్తుంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకపక్క ఎన్నికల వ్యూహాలతో ముందుకు వెళుతూనే, అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తూనే మరోపక్క వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై యుద్ధం చేయబోతున్నారు. అధికార టిడిపి ఓటర్ల జాబితా నుండి అక్రమంగా ఓట్ల తొలగింపు పాల్పడుతుందని, వైసిపి ఓటుబ్యాంకు ని దెబ్బ కొట్టేందుకు ఈ తరహా వ్యూహాలతో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఓటర్ల జాబితా అక్రమాలపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.
వైసీపీ అధినేత, వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు(ఫిబ్రవరి 4) కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ను కలవనున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, ఇతర అవకతవకలపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసేందుకు ఆయన ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. జగన్ తో పాటుగా ముఖ్యనేతలు బొత్స సత్యనారాణయన, అంబటి రాంబాబు, విజయసాయిరెడ్డి, మేకపాటి, అలాగే పార్టీకి చెందిన మాజీ ఎంపీలు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 11.30గంటలకు వైఎస్‌ జగన్‌ పార్టీ నేతలను కలుపుకుని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ను కలుస్తారు. ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున అవకతవకలు, అక్రమంగా పేర్ల తొలగింపు చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article