లోక్‌సభ నుంచి తెదేపా సభ్యుల సస్పెన్షన్

దిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. విభజన హామీలు నెరవేర్చి, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ లోక్‌సభలో ఆందోళనకు దిగిన తెదేపా సభ్యులను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సస్పెండ్‌ చేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ వారిపై వేటు వేశారు. ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, తోట నరసింహం, మురళీమోహన్‌, బుట్టారేణుక, అవంతి శ్రీనివాస్‌, మాగంటి బాబు, జేసీ దివాకర్‌రెడ్డి, శ్రీరాం మాల్యాద్రి, అశోక్‌ గజపతిరాజు, కొనకళ్ల నారాయణలను నాలుగు రోజుల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article