Tuesday, December 24, 2024

శ్రీచైతన్యలో దారుణం.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌లోని బాచుపల్లి పీఎస్‌ పరిధిలో ఉన్న శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న జశ్వంత్ గౌడ్ అనే విద్యార్థి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జశ్వంత్ గౌడ్ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్‌లో రూమ్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరేసుకున్న జశ్వంత్ గౌడ్‌ను గమనించిన కళాశాల సిబ్బంది.. నిజాంపేట్‌లోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జశ్వంత్ గౌడ్ మరణించారని వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కాగా, జశ్వంత్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవటానికి కారణం మాత్రం తెలియలేదు. జశ్వంత్ గౌడ్ స్వస్థలం కామారెడ్డి జిల్లా. శ్రీచైతన్య కళాశాలలో బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాడు. కాలేజీ క్యాంపస్‌లోని హాస్టల్‌లోనే ఉంటున్నాడు. జశ్వంత్ గౌడ్ ఉరివేసుకుని మృతి చెందినట్ల కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు తెలిపారు. బిడ్డ మరణ వార్త విని తల్లిదండ్రులు ఎంతో దుక్కించారు. మంచిగా చదువుకుని ఉన్నంత ఉద్యోగాలు చేస్తారని.. ఆశపడిన తల్లిదండ్రులకు ఇలా కన్నీరు మిగిలిచ్చి పోయాడు జశ్వంత్ గౌడ్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి మృతి విచారణ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడ్డడా అనే కోణంలో పోలీసుల ఆరా తీసుకున్నారు. పరీక్షలు దగ్గర పడుతున్న వేళ ఇలా జరగటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com