తెలంగాణలో సడక్ బంద్

​SADAK BANDH IN TELANGANA
​హైదరాబాద్ జేఏసీ నేతను మఫ్టీ పోలీసులు అరెస్ట్ చేశారని..  ​దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ జెఎసి కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి ఆరోపించారు. ​కోర్టును, ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందన్నారు.  ​విలీనం తాత్కాలికంగా పక్కన పెట్టామని, ​ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని కోరుతున్నామని అన్నారు. ​చనిపోయిన 23 కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ​ఆర్టీసీని రక్షించాలంటూ రేపు 15 న బైక్ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. తనతో పాటు నలుగురు హైదరాబాద్ లో 16న నిరాహార దీక్ష చేస్తారన్నారు.  ​

17, 18 డిపోల దగ్గర కార్మికుల సామూహిక దీక్ష
​19 న హైదరాబాద్ నుండి కోదాడ వరకు సడక్ బంద్ నిర్వహిస్తామని చెప్పారు. ​గవర్నర్ అప్పాయింట్ మెంట్ కోరామని,
​​రేపో, ఎల్లుండి చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులతో గవర్నర్ ను కలుస్తామని చెప్పారు. ​NHRC అప్పాయింట్ మెంట్ కూడా కోరామన్నారు. ​కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కనీసం పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. ​ఆర్టీసీ ప్రైవేటు పరం చేస్తే బడుగు బలహీన వర్గాలు ఉపాధి అవకా శాన్ని కోల్పోవలసి వస్తుందన్నారు. ​ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీల్లో అది రుజువవుతోందని చెప్పారు.  ​సడక్ బంద్ కార్యక్రమంలో ప్రజలు విద్యార్థులు కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలని కోరుతున్నామని తెలిపారు.
​సడక్ బంద్ కార్యక్రమం ఆర్టీసీ పేరుతో విజయవంతం చేయాలన్నారు. ​కేంద్ర హోమ్ శాఖసహాయ మంత్రి కిషన్ రెడ్డి తమ కార్యక్రమాలకు మద్దతు పలికారని, వారికి ధన్యవాదాలని తెలిపారు.

TSRTC STRIKE UPDATES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *