Thursday, February 27, 2025

ఎస్‌ఎల్‌బీసీ దగ్గర ఉద్రిక్తత

టన్నెల్‌ దగ్గర హ‌రీశ్‌రావు.. లోప‌లికి అనుమ‌తించ‌ని పోలీసులు

ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు వ‌ద్ద‌కు మాజీ మంత్రులు హ‌రీశ్‌రావు, జ‌గ‌దీశ్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గువ్వ‌ల బాల‌రాజు, బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు చేరుకున్నారు. అయితే సొరంగంలోకి వెళ్ల‌నీయ‌కుండా హ‌రీశ్‌రావు బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హ‌రీశ్‌రావు, ఇత‌ర నాయ‌కులు రోడ్డుపైనే బైఠాయించిన నిర‌స‌న తెలిపారు. పోలీసుల తీరుపై హ‌రీశ్‌రావు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కల్వకుర్తి నుంచి నేరుగా ఎస్ఎల్బీసీ సొరంగం వ‌ద్ద‌కు బీఆర్‌ఎస్‌ బృందం చేరుకున్న‌ప్ప‌టికీ.. లోప‌లికి పోలీసులు అనుమ‌తించ‌డం లేదు. ఇక్కడ భారీగా పోలీసులు మోహ‌రించారు. మీడియాపై కూడా పోలీసులు ఆంక్ష‌లు విధించారు. దీంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం అక్కడే బైఠాయించింది.

ప్ర‌దాన వార్త‌లు

గవర్నర్ అంటే అంత లెక్కలేనితనమా? అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com