Friday, May 16, 2025

కాగ్ కొత్త ఛీఫ్‌గా కె. సంజయ్ మూర్తి

భారత కంప్ట్రోల్ అండ్ జనరల్ ఛీఫ్‌గా ఐఏఎస్ అధికారిగా కె. సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ఈయనను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నియమించారు. ప్రస్తుతం సంజయ్ కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నారు.
కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) చీఫ్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ మూర్తి నియామ‌కం కాగా.. ప్రస్తుత కాగ్‌ చీఫ్‌ జీసీ ముర్ము పదవీకాలం బుధవారంతో ముగియనుంది. ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన సంజయ్‌.. 1989లో ఐఏఎస్‌కు ఎంపికై.. హిమాచల్‌ క్యాడర్‌లో సేవలందించారు. 2002-07 మధ్యకాలంలో కేంద్ర సర్వీసుల్లో భాగంగా.. పర్యావరణ, అటవీ, ఐటీ మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. ఐటీలో ఉన్నప్పుడే.. హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్మార్ట్‌ గవర్నమెంట్‌(ఎన్‌ఐఎ్‌సజీ)లో మూడేళ్లు డైరెక్టర్‌గా కొనసాగారు. గురువారం ఆయన కాగ్‌ బాధ్యతలు చేపడతారు.
అమలాపురంకు చెందిన సంజయ్ మూర్తి కాగ్ చీఫ్‌గా నియామ‌కం కావ‌డంపై తెలుగు రాష్ట్రాల నుంచి అభినంద‌న‌లు వెల్లువెత్తాయి.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com