Wednesday, May 14, 2025

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కేశవరావు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ నాయకుడు కే.కేశవరావు నియాకం అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే బిఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నాయకుడు కె.కేశవరావుకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. ఆయనకు కాంగ్రెస్ సర్కారు కేబినెట్ హోదాను కల్పించింది. ప్రజా సంబంధాల శాఖలో ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. కాగా, తెలంగాణ రాక ముందు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్న కేకే రాష్ట్రం వచ్చాక బిఆర్‌ఎస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడితో పాటు పార్టీలో పలు కీలక పదవులు అనుభవించారు. కెసిఆర్ విధానాలతో పొసగక ఆ పార్టీకి రాజీనామా చేసి, ఇటీవలే ఢిల్లీలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తర్వాత తన రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలువురి నాయకులను ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు వేం నరేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారుగా, షబ్బీర్ అలీని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ శాఖలకు సలహాదారుడిగా, హర్కర వేణుగోపాల్ ను ఫ్రొటోకాల్, ప్రజా సంబంధాల సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాకు చెందిన డా.మల్లు రవిని రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించగా, ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆయన నాగర్ కర్నూల్ ఎంపిగా గెలిచి ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవిలో అదే జిల్లాకు చెందిన జితేందర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. కాగా, బిజెపి పార్టీలో ఉన్న జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపి స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. అనంతరం సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com