Sunday, December 29, 2024

ల‌గ‌చ‌ర్ల కుట్ర కేసీఆర్ దే 10 కోట్ల నిధులు స‌మ‌కూర్చింది ఆయ‌నే

ల‌గ‌చ‌ర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. ఈ కుట్ర మొత్తం బీఆర్ ఎస్ బాస్ కేసీఆర్ చేయించార‌ని ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాదులు వాదిస్తున్నారు. త‌న అరెస్ట్ అక్ర‌మ‌మంటూ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి స‌తీమ‌ణి శ్వేత దాఖ‌లు చేసిన క్వాష్ పిటిష‌న్‌పై వాద‌న‌ల సంద‌ర్భంగా.. కేసీఆర్ పేరును ప్ర‌స్తావించారు. ఈ దాడికి కుట్ర‌దారు ఆయ‌నేన‌ని, నిధులు కూడా స‌మ‌కూర్చారంటూ లిఖిత‌పూర్వ‌కంగా న్యాయ‌స్థానానికి స‌మ‌ర్పించారు.
ఇప్పటికే స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి రాష్ట్ర పార్టీ కార్యనిర్వకర అధ్యక్షుడి వరకు అనేక మంది పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు పెద్ద నాయకుడి పేరు ఈ కేసులో వినిపిస్తోంది. లగచర్ల ఘటనలో కేసీఆర్‌ పాత్ర కూడా ఉందంటూ ప్రభుత్వం లాయర్లు వెల్లడిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ సైతం ఈ కేసులో ఇన్వాల్ అయ్యారనే విషయాన్ని న్యాయ‌స్థానం ముందుంచారు.
ఫార్మాసిటి నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ అంశాన్ని ఆసరాగా చేసుకుని రాష్ట్ర స్థాయి నేతలు పెద్ద కుట్రలకే పాల్పడ్డారని పోలీసు విచారణలో వెల్లడవుతోంది. ఇప్పటికే.. ఈ దాడి వెనుక ప్రభుత్వాన్ని గద్దె దింపాలని, సర్కార్ ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశ్యం ఉన్నట్లు రిమాండ్ లోని నిందుతుల విచారణలో వెల్లడైంది. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ పెద్ద సారు సైతం తలదూర్చారని, ఈ కుట్ర వెనుక ప్ర‌భుత్వాన్ని కూల్చివేసే ఉద్దేశాలు ఉన్నాయని చర్చ నడుస్తోంది.

కేసీఆర్ కుట్ర‌
ఈ దాడి కేసులో కేటీఆర్ పేరును ఇప్పటికే బయటపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. అధికారికంగా కూడా కేటీఆర్ పేరును రికార్డుల్లో ప్రకటించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర సర్కార్.. ఏకంగా ప్రభుత్వ అధికారుల్నే టార్గెట్ గా చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించింది.
అయితే, తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, తన రిమాండ్ ను రద్దు చేయాలంటూ పట్నం నరేంద్ర రెడ్డి హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా జరిగిన వాదనల సమయంలో.. ప్రభుత్వం అసలు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. లగచర్ల దాడి కుట్రలో నిందితులతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రర్ రెడ్డి నేరుగా సంప్రదింపులు జరిపారని తెలిపారు. ఆయన వెనుక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఉన్నట్లు ప్రభుత్వం తరఫున న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ఈ దాడి కుట్రలో నిందితుల్ని రెచ్చగొట్టేందుకు కేసీఆర్ రూ.10 కోట్లు విడుదల చేశారని తెలిపారు. సురేష్ ద్వారా జిల్లా కలెక్టర్ ను హత్య చేసేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. ఇందుకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని కోర్టు ప్రశ్నించగా, పట్నం నరేంద్రర్ రెడ్డి, కీటీఆర్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలతో పాటు మాజీ ఎమ్మెల్యే నరేంద్రర్ రెడ్డి, ప్రధాన నిందితుడు సురేష్ తో మాట్లాడిన కాల్ డేటా వంటి ఆధారాలను సమర్పించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com